News December 16, 2025
జగిత్యాల: మూడో విడత ఎన్నికలకు భారీ బందోబస్తు

జగిత్యాల జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి, గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్ మండలాల్లో 119 పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News January 13, 2026
ఖమ్మం: చికెన్ ధరకు రెక్కలు.. సామాన్యుడికి ‘ముక్క’ కష్టమే!

ఉమ్మడి ఖమ్మంలో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నెల క్రితం రూ. 250 ఉన్న స్కిన్‌లెస్ కిలో ధర ప్రస్తుతం రూ. 350కి చేరింది. సంక్రాంతి పండుగ, శుభకార్యాల సీజన్‌తో డిమాండ్ పెరగడం, చలి తీవ్రతకు ఉత్పత్తి తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. లైవ్ కోడి ధర కూడా రూ. 180 మార్కును దాటింది. రానున్న మేడారం జాతర నాటికి ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో మాంసప్రియులు ఆందోళన చెందుతున్నారు.
News January 13, 2026
తక్కువ ఖర్చుతో పంటకు రక్ష, దిగుబడికి భరోసా

సాగులో ప్రకృతి వైపరీత్యాల కంటే చీడపీడలతోనే ఎక్కువ నష్టం జరుగుతోంది. ఈ సమస్య నివారణకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, లైట్ ట్రాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి పురుగులను ఆకర్షించి, నిర్మూలించి వాటి ఉద్ధృతి పెరగకుండా కట్టడి చేస్తున్నాయి. దీంతో పురుగు మందుల వినియోగం తగ్గి, పర్యావరణానికి, మిత్ర పురుగులకు మేలు జరుగుతోంది. ఏ పంటకు ఏ పరికరం వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News January 13, 2026
వేములవాడ: భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 12 నుంచి సోమవారం రాత్రి 10 గంటల వరకు మొత్తం 1,08,438 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో రమాదేవి వెల్లడించారు. 10,294 మంది భక్తులు కోడె మొక్కులు చెల్లించినట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.


