News December 16, 2025

సాయుధ దళాల నిధికి మెప్మా రూ.8 లక్షల విరాళం

image

సాయుధ దళాల పతాక నిధికి కాకినాడ జిల్లా మెప్మా సిబ్బంది సేకరించిన రూ.8,07,000 చెక్కును మంగళవారం కలెక్టరేట్‌లో అందజేశారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, మెప్మా అధికారులతో కలిసి జిల్లా సైనిక సంక్షేమ అధికారికి ఈ విరాళాన్ని అందజేశారు. మాజీ సైనికుల పునరావాసం, సంక్షేమానికి సేకరించిన ఈ విరాళం గొప్ప విశేషమన్నారు. ఇదే స్ఫూర్తితో ఇతర శాఖల సిబ్బంది విరివిగా విరాళాలు ఇవ్వాలని జేసీ కోరారు.

Similar News

News December 28, 2025

సభా సమయం.. వేడెక్కిన రాజకీయం!

image

TG: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేతల కామెంట్లతో రాజకీయం వేడెక్కింది. సభలో ప్రభుత్వం హుందాగా ప్రవర్తిస్తుందని, ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అటు ఎన్నిరోజులైనా సభను నడుపుతామని చెప్పే ప్రభుత్వం ఒక్కరోజుతో సమావేశాలు ముగించేస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కనీసం 15రోజులైనా సభను నడపాలని ఆయన డిమాండ్ చేశారు.

News December 28, 2025

కరీంనగర్: రేపటి నుంచి యథావిధిగా ‘ప్రజావాణి’

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమానికి అర్జీదారులు హాజరుకావాలని సూచించారు. వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

News December 28, 2025

జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉండాలంటే?

image

జ్ఞాపకశక్తి బాగుండాలంటే మెదడుకూ వ్యాయామం అవసరం అంటున్నారు నిపుణులు. దీనికోసం రోజూ ధ్యానం చెయ్యడం, పజిల్స్‌ నింపడం, పుస్తకపఠనం, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం మంచిదని సూచిస్తున్నారు. మెదడును ఎప్పుడూ చురుకుగా ఉండటానికి ప్రయత్నించాలి. దీంతో పాటు రోజూ వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి మెదడు పనితీరు బాగుంటుంది. జ్ఞానసంబంధమైన సామర్థ్యం పెరుగుతుందంటున్నారు.