News December 16, 2025
నల్గొండ: పొత్తు వ్యూహంతో పదునెక్కిన కొడవళ్లు

ఇటీవల జరిగిన మొదటి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పొత్తులతో కమ్యూనిస్టు పార్టీలు ఉత్తమ ఫలితాలు సాధించాయి. సీపీఎం 48, సీపీఐ 63, సీపీఐ(ఎంఎల్) మాస్ 10 స్థానాలు గెలుచుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కొత్తగూడెం జిల్లాల్లో వీరి ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తో పొత్తులు కలిసి వచ్చాయి.
Similar News
News January 12, 2026
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 10% జీతం కట్: సీఎం

TG: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా అలా చేస్తే ప్రతి నెలా జీతంలో 10 శాతం తల్లిదండ్రులకు అందించేలా చట్టం తెస్తామని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిశీలించి పిల్లల జీతంలో నేరుగా 10 శాతం తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాభవన్‌లో ‘ప్రణామ్’ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లను సీఎం ప్రారంభించారు.
News January 12, 2026
అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి పరిష్కారం చూపాలి: JC

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి బాధితులకు పరిష్కారం చూపాలని బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన చెప్పారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ఆమె ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News January 12, 2026
దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు: రేవంత్

TG: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని CM రేవంత్ ప్రకటించారు. దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా ఆర్థికసాయం అందిస్తామన్నారు. విద్య, ఉద్యోగాల భర్తీలో వారికి కోటాను కేటాయిస్తున్నట్లు ప్రజాభవన్‌లో ఓ కార్యక్రమంలో తెలిపారు. కుటుంబసభ్యుల్లా భరోసా కల్పిస్తూ వారికి రూ.50 కోట్లతో ఉపకరణాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. అవకాశాలను ఉపయోగించుకుని ఆత్మస్థైర్యంతో ఎదగాలని పిలుపునిచ్చారు.


