News April 21, 2024
భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్ ఆడాలి: అఫ్రీదీ

భారత్-పాక్ ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లు ఆడితే బాగుంటుందన్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యలపై పాక్ మాజీ క్రికెటర్ అఫ్రీదీ స్పందించారు. ‘రెండు దేశాల మధ్య సిరీస్ గురించి రోహిత్ చాలా మంచి అభిప్రాయం చెప్పారు. ఈ దేశాల విషయంలో క్రికెట్‌ది కీలక పాత్ర. మ్యాచులు జరిగితే బంధం మెరుగవుతుంది. చక్కటి బంధం మన హక్కు’ అని స్పష్టం చేశారు. భారత్-పాక్ మధ్య చివరిగా టెస్టు సిరీస్ 16ఏళ్ల క్రితం జరిగింది.
Similar News
News March 13, 2026
వెహికల్ రిజిస్ట్రేషన్‌లకు నేటి నుంచి కొత్త విధానం

TG: వాహనాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లో జరగనుంది. నేటి నుంచి ఫిజికల్ పేపర్లు తీసుకోబోమని రవాణాశాఖ వెల్లడించింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ అయిన 7రోజుల్లోగా డీలర్లు వెహికల్ ఓనర్, ఫైనాన్షియర్ సంతకాలతో ఫామ్20, ఇతర పత్రాలు ఆన్‌లైన్‌లో సమర్పించాలని తెలిపింది. 2 పని దినాల్లో వాటిని ఆమోదించాలని అధికారులను ఆదేశించింది. నకిలీ పత్రాలు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
News March 13, 2026
ఉగాది కానుక.. నేడు అకౌంట్లలోకి రూ.6వేలు

పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా ఇవాళ PM మోదీ అస్సాం పర్యటనలో 22వ విడత నిధులు విడుదల చేయనున్నారు. 9.32Cr మంది ఖాతాల్లో ₹2K చొప్పున జమ చేస్తారు. అలాగే APలో ఉగాది కానుకగా PM KISANతోపాటు అన్నదాత సుఖీభవ నిధులను CM CBN కృష్ణా(D) గన్నవరంలో రిలీజ్ చేస్తారు. 46.85L మంది అకౌంట్లలో ₹6K చొప్పున(₹2K+₹4K) జమ చేస్తారు. ఈ జాబితాలో మీ పేరుందో లేదో <
News March 13, 2026
పంత్ మరో అభిషేక్ అవుతాడా?

LSG కెప్టెన్ రిషభ్ పంత్ గత IPL సీజన్‌లో బ్యాటింగ్‌లో తడబడిన సంగతి తెలిసిందే. RCBపై సెంచరీ మినహా మిగతా మ్యాచుల్లో రాణించలేకపోయారు. దీంతో ఈసారి యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల 4 రోజులపాటు ముంబైలో బ్యాటింగ్ సెషన్లు జరిగాయి. గతంలో అభిషేక్ శర్మ, గిల్, ప్రభ్‌సిమ్రాన్ వంటి బ్యాటర్లకు యువీ శిక్షణనిచ్చారు. ఈ నేపథ్యంలో అభిషేక్‌లా పంత్ రాణిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.


