News April 21, 2024

బాంబుల నుంచి గులకరాయికి రావడం మంచిదే: నారాయణ

image

AP: సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి ఘటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు వేశారు. ‘బాంబు దాడుల నుంచి గులకరాయికి రావడం మంచిదే. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాళ్లకు కట్టుతో తిరిగారు. ఇక్కడ సీఎం జగన్ తలకు కట్టుకున్నారు. ప్రజలకు గులకరాయి కథలు తెలుసు. ఇప్పుడు మరణవార్త అని చెప్పినా ఎవరూ నమ్మబోరు. రాయి వేసిన వారిని కాకుండా పోలీసులు మరొకరిని ఇరికించాలని చూస్తున్నారు’ అని విమర్శించారు.

Similar News

News October 15, 2024

అనిల్ అంబానీని లాభాల్లోకి తెచ్చిన వారసులు

image

నష్టాలు, అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీని ఆయన కుమారులు అన్‌మోల్, అన్షుల్ లాభాల్లోకి తీసుకువచ్చి సగర్వంగా తలెత్తుకునేలా చేశారు. వారి రాకతో రిలయన్స్ పవర్ రూ.20,526 కోట్ల విలువైన కంపెనీగా నిలబడింది. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ క్యాపిటల్ సంస్థలూ లాభాల బాట పట్టడంతో కొడుకులను చూసి అనిల్ మురిసిపోతున్నారు. ఇదే ఉత్సాహంతో అనిల్ భూటాన్‌లో సోలార్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను చేపడుతున్నారు.

News October 15, 2024

వ్యాయామం ఎంతసేపు చేయాలంటే?

image

ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా వ్యాయామం చేయాలి. కానీ రోజుకు ఎంత సేపు చేయాలి, ఎలా చేయాలనే దానిపై కొందరికి అవగాహన ఉండదు. వారంలో 5 రోజులపాటు గంట చొప్పున ఎక్సర్‌సైజ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు అదుపులో పెట్టుకుని వ్యాయామం చేస్తే ఎక్కువ క్యాలరీలు ఖర్చు అయ్యి బరువు తగ్గుతారు. అలాగే నడక కూడా మన ఆరోగ్యం విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రోజూ వీలైనంత దూరం నడక కొనసాగించాలి.

News October 15, 2024

RED ALERT: ఈ జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు

image

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారత వాతావరణ విభాగం (IMD) నేడు ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.