News December 16, 2025

ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ

image

పైరసీ వ్యవహారంలో అరెస్టైన ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవిని నాంపల్లి జిల్లా కోర్టు మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగించింది. 3 కేసుల్లో విచారణ కోసం 12 రోజులకు అనుమతించింది. ఒక్కో కేసులో 4 రోజుల చొప్పున ప్రశ్నించాలని పోలీసులకు సూచించింది. దీంతో ఎల్లుండి నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు రవిని విచారించనున్నారు. ప్రస్తుతం రవి చంచల్‌గూడ జైలులో ఉన్నాడు.

Similar News

News January 13, 2026

ఎంత ప్రయత్నించినా పెళ్లి కావడం లేదా? రేపే లాస్ట్..

image

ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి సంబంధం కుదరని వారు రేపు గోదా రంగనాథుల కళ్యాణాన్ని వీక్షించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ వేడుకను దర్శిస్తే తప్పక వివాహ యోగం కలుగుతుందని అంటున్నారు. ‘స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం వల్ల జాతకంలోని వివాహ ప్రతిబంధకాలు తొలగిపోతాయి. త్వరగా పెళ్లి జరిగే అవకాశాలు పెరుగుతాయి. గోదాదేవి చేసిన తిరుప్పావై వ్రత ఫలితంగానే ఆమెకు విష్ణుమూర్తి భర్తగా లభించారు’ అని చెబుతున్నారు.

News January 13, 2026

భారత్‌కు మరో S-400.. వచ్చేది ఎప్పుడంటే?

image

భారత రక్షణ శక్తి మరింత బలోపేతం కానుంది. రష్యా నుంచి నాలుగో S-400 క్షిపణి వ్యవస్థ ఈ ఏడాది మే నాటికి భారత్‌కు అందనున్నట్లు నివేదికలు వెల్లడించాయి. 2018లో కుదిరిన రూ.40 వేల కోట్ల ఒప్పందం ప్రకారం మొత్తం 5 వ్యవస్థలు కొనుగోలు చేయగా, ఇప్పటికే 3 భారత్‌కు చేరాయి. నాలుగోది ఈ ఏడాది మేలో, చివరిది 2027లో డెలివరీ కానుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో S-400లు అద్భుతంగా పని చేసిన విషయం తెలిసిందే.

News January 13, 2026

ఐఫోన్ యూజర్లకు అలర్ట్

image

ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. ‘జీరో క్లిక్ స్పైవేర్’ దాడులు జరుగుతున్నట్లు తెలిపింది. లింక్ క్లిక్ చేయకుండానే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 11 నుంచి ఆపై మోడల్స్ ఉపయోగిస్తున్న వారు iOS 26కి వెంటనే అప్‌డేట్ కావాలని సూచించింది. అదనంగా లాక్‌డౌన్ మోడ్ ఆన్ చేయడం, ఫోన్‌ను తరచూ రీబూట్ చేయడం ద్వారా రక్షణ పెరుగుతుందని స్పష్టం చేసింది.