News April 21, 2024
24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర

TG: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 24 నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఆ రోజున మిర్యాలగూడలో రోడ్‌షో నిర్వహిస్తారు. 17 రోజులపాటు యాత్ర కొనసాగనుంది. మే 10న సిద్దిపేటలో ప్రచారానికి ముగింపు పలకనున్నారు.
Similar News
News March 13, 2026
వార్ ఎఫెక్ట్.. కేంద్రానికి భారంగా ఫర్టిలైజర్ సబ్సిడీ!

ఇరాన్ యుద్ధంతో చమురు ధరలు పెరగడం, సరఫరాలో అంతరాయాల కారణంగా ఎరువుల సబ్సిడీ ఖర్చు కేంద్రానికి భారంగా మారనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ సబ్సిడీల బడ్జెట్ అంచనా ₹1.7లక్షల కోట్లు కాగా ఇప్పుడది ₹2.2 లక్షల కోట్లకు చేరొచ్చని కేంద్రవర్గాల సమాచారం. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం ₹1.71లక్షల కోట్లలో ఫర్టిలైజర్ సబ్సిడీకి ₹1.16లక్షల కోట్లు, నాన్-యూరియా ఫర్టిలైజర్స్‌కు ₹54వేల కోట్లను కేంద్రం కేటాయించింది.
News March 13, 2026
హార్ముజ్‌లో నౌకలకు రక్షణ ఇవ్వలేం.. చేతులెత్తేసిన అమెరికా!

హార్ముజ్ జలసంధిని దాటుకొని నౌకలు <<19338961>>ధైర్యంగా వెళ్లాలని<<>> చెప్పిన అమెరికా ఇప్పుడు చేతులెత్తేసింది. ‘హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు రక్షణ కల్పించలేం. ప్రస్తుతానికి మేం రెడీగా లేము. ఇరాన్‌పై దాడులు చేయడంపైనే మా సైన్యం దృష్టి ఉంది. ఈ నెలాఖరుకు ఎస్కార్ట్ కల్పించే ఛాన్స్ ఉంది’ అని US ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ చెప్పారు. ఇవాళ US షిప్‌పై ఇరాన్ <<19364482>>దాడి చేయడం<<>> తెలిసిందే.
News March 13, 2026
65 లక్షల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు: రేవంత్

TG: వైద్యం యాంత్రికంగా ఉండొద్దని, మానవత్వంతో కూడిన చికిత్స అందించాలని CM రేవంత్ అన్నారు. ప్రైవేట్ రంగంలోని డాక్టర్లు ఏడాదిలో ఒక నెల ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేయాలని చెప్పారు. ‘రాష్ట్రంలో 65L మంది హెల్త్ డేటా తయారు చేస్తున్నాం. వాళ్లకు డిజిటల్ హెల్త్ కార్డులిస్తాం’ అని తెలిపారు. 1.30 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా అందించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. క్యాన్సర్‌కు చికిత్స పైనా దృష్టి పెట్టామన్నారు.


