News December 16, 2025

హనుమకొండలో ఎన్నికలకు సర్వం సిద్ధం

image

జిల్లాలో బుధవారం జరిగే మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆత్మకూరు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ స్వయంగా సందర్శించి, పోలింగ్ సామగ్రి పంపిణీని, సిబ్బంది రిపోర్టింగ్‌ను పర్యవేక్షించారు. ఈ విడతలో ఆత్మకూర్, దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లోని 67 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.

Similar News

News December 27, 2025

నర్సంపేట: పొలాల్లో మొసలి కలకలం!

image

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముగ్ధుంపురం గ్రామంలో మొసలి పిల్ల కలకలం రేపింది. ఓ రైతు పొలంలో శుక్రవారం సాయంత్రం మొసలి పిల్ల కనిపించింది. స్థానికులు భయంతో వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ సిబ్బంది మొసలిని పట్టుకొని ఖానాపురం మండలం పాకాల సరస్సులో వదిలినట్లు తెలిపారు. సమీపంలో వాగు నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.

News December 27, 2025

మరణంలోనూ వీడని స్నేహం

image

కర్ణాటకలో జరిగిన ఘోర <<18664780>>బస్సు ప్రమాదం<<>> పలు కుటుంబాల్లో విషాదం నింపింది. చనిపోయిన వారిలో నవ్య, మానస అనే ఇద్దరు ప్రాణ స్నేహితులున్నారు. మరణంలోనూ వారు కలిసే ఉన్నారంటూ నవ్య తండ్రి రోదించారు. ‘వాళ్లు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఒకే కంచంలో తినేవారు. ఒకేచోట చదువుకున్నారు. ఒకే రకం డ్రెస్సులు వేసుకునే వారు. ఒకేచోట పని చేస్తున్నారు. సెలవని ఇంటికొస్తూ ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు’ అని విలపించారు.

News December 27, 2025

ఆందోల్: నీటిలో మునిగి బాలుడు మృతి

image

ఆందోల్ మండలం మాన్సాన్‌పల్లికి చెందిన ప్రసాద్(16) నీట మునిగి చనిపోయాడు. స్నేహితులతో కలిసి ఘనపూర్ ప్రాజెక్టు రెండో బ్రిడ్జి వద్ద ఈతకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నీటిలో మునిగిపోతున్న ఓ స్నేహితుడిని రక్షించే క్రమంలో ప్రసాద్ లోతులోకి వెళ్లి చిక్కుకుపోయాడు. అక్కడే ఉన్న మత్స్యకారుడు ఒకరిని రక్షించగలిగినప్పటికీ, ప్రసాద్ చనిపోయాడు. పోలీసులు, గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.