News December 16, 2025
సంక్రాంతికి విజయనగరంలో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా విజయనగరం ఆర్టీసీ వారు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు డీపీటీవో జీ.వరలక్ష్మి తెలిపారు. విజయనగరం, ఎస్.కోట డిపోల నుంచి జనవరి 8-14వ తేదీ వరకు ప్రతీ రోజు విజయవాడ, భీమవరం, రాజోలు, విశాఖకి ప్రత్యేక బస్సులు నడుపుటకు వెల్లడించారు. ఈ బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలు లేవని.. సాధారణ ఛార్జీలు మాత్రమే వర్తిస్తాయి చెప్పారు.
Similar News
News April 7, 2026
అలర్ట్.. నేడు విజయనగరం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు..!

ఉపరితల అవర్తనం ప్రభావంతో విజయనగరం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం పడేటప్పుడు శిథిలావస్థ భవనాలు, కరెంట్ స్తంభాల వద్ద ఉండకూడదని సూచించారు. నిన్న పిడుగులు పడి వంగర మండలంలో ఓ మహిళ, తెర్లాం మండలం ఎద్దు చనిపోయిన విషయం తెలిసిందే.
News April 7, 2026
VZM: ఈ నెల 9న టీటీడీసీలో జాబ్ మేళా

డీఆర్‌డీఏ-సీడాప్ ఆధ్వర్యంలో ఈ నెల 9న ఉదయం 9 గంటల నుంచి స్థానిక టీటీడీసీ మహిళా ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి సోమవారం తెలిపారు. వివిధ కంపెనీల్లో మొత్తం 1960 ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని, ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్, విద్యార్హత సర్టిఫికెట్లు, బయోడేటా, ఫోటోలు తీసుకుని హాజరుకావాలని సూచించారు.