News December 16, 2025
ఈనెల 19న ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ డే: కలెక్టర్

ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఈనెల 19న మధ్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతినెలా మూడో శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్ డేను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News January 13, 2026
నెల్లూరు ఎస్పీ హెచ్చరికలు ఇవే..!

సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు, జూదాన్ని నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. జూదాలు నిర్వహంచినా, అందులో పాల్గొన్నా కేసులు తప్పవని చెప్పారు. ఎక్కడైనా కోడి పందెం, జూద శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే 112కు కాల్ చేయాలని ఆమె కోరారు.
News January 13, 2026
నెల్లూరు జిల్లాలో MROలు పట్టించుకోవడం లేదు..!

అనంతసాగరం లింగంగుట్టలో 2022లో రీసర్వే చేసి 1B భూములను చుక్కల భూములుగా తేల్చారు. 114మందికి చెందిన భూములను ఒకే వ్యక్తి కిందకు చేర్చారు. బాధితులకు 1బీ అడంగల్ అందక, రిజిస్ట్రేషన్లు జరగక అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నెల్లూరులో సోమవారం JCకి అర్జీ ఇవ్వగా.. వీటిని MRO, RDO లాగిన్‌లోనే చేయాలని చెప్పారు. MRO, RDOలకు ఈ అంశంలో ఫుల్ పవర్స్ ఇచ్చినా బాధితులకు న్యాయం జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
News January 13, 2026
నెల్లూరులో భార్య పోలీస్.. భర్త దొంగ!

నెల్లూరులో కార్ల <<18838353>>దొంగతనం <<>>వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తిరుపతిలోని ఓ కారు షోరూమ్‌లో పనిచేసే లక్ష్మణ్ కుమార్, కారు మెకానిక్ శివ(నెల్లూరు బీవీనగర్), A1 నిందితుడు ఫ్రెండ్స్. ఢిల్లీ, ముంబయిలో A1 కార్లు చోరీ చేసి నెల్లూరుకు తెస్తే ఈ ఇద్దరూ AP, TS నంబర్ ప్లేట్లు మార్చి తక్కువ రేటుకు అమ్మేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే A1 ఓ లేడీ కానిస్టేబుల్ భర్త అని సమాచారం. అతనిపై చాలా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.


