News December 16, 2025
BHPL: సర్పంచులుగా గెలుపొందిన మాజీ ఎంపీపీలు

జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గణపురం, భూపాలపల్లి మండలాల తాజా మాజీ ఎంపీపీలు కావటి రజిత, మందల లావణ్య రెడ్డిలు సర్పంచులుగా విజయం సాధించారు. రజిత (కాంగ్రెస్) చెల్పూర్ సర్పంచ్‌గా, లావణ్య రెడ్డి (బీఆర్‌ఎస్) గొర్లవీడు సర్పంచ్‌గా గెలుపొందారు. ఎంపీపీ స్థాయి నుంచి సర్పంచులుగా గెలవడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు.
Similar News
News January 16, 2026
ప్రీటెర్మ్ బర్త్‌కు ఇదే కారణం

గర్భధారణ తర్వాత తొమ్మిది నెలలు నిండాక బిడ్డకు జన్మనివ్వడం సాధారణం. కానీ మరికొందరిలో నెలలు నిండక ముందే ప్రసవం జరుగుతుంది. దీన్నే ప్రీటెర్మ్ బర్త్ అని కూడా అంటారు. ఇలా నెలల నిండకుండానే డెలివరీ కాకపోవడానికి పోషకాహార లోపం, రక్తహీనత, మానసిక సమస్యలే ముఖ్య కారణమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇలా ఎక్కువగా స్ట్రెస్ కాకుండా ప్రశాంతంగా ఉంటూ పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
News January 16, 2026
9 నెలల్లో భారత్ ఎగుమతులు 634 బిలియన్ డాలర్లు

భారత్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9 నెలల్లో 4.33% వృద్ధితో 634 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసింది. వాణిజ్య శాఖ ప్రాథమిక డేటా ప్రకారం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య వస్తువుల ఎగుమతులు 330 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో ప్రధానంగా తృణధాన్యాలు, ఎలక్ట్రానిక్స్, జీడిపప్పు, మాంసం, పాల ఉత్పత్తులు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువగా అమెరికా, చైనా, UAE, స్పెయిన్, హాంకాంగ్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
News January 16, 2026
వరంగల్: సొంతంగా కాలు పెట్టే పరిస్థితి లేదు!

వరుస జాతరలతో ఉమ్మడి వరంగల్ కిటకిటలాడుతుంటే.. మరోవైపు జిల్లా మంత్రుల పరిస్థితి విచిత్రంగా ఉంది. కొత్తకొండ, ఐనవోలు, అగ్రంపహాడ్, కంఠత్మాకూర్, మేడారం జాతరలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇదిలా ఉంటే దేవాదాయశాఖ మంత్రి సురేఖ స్వయంగా పర్యవేక్షించాల్సిన జాతరలకు, దూరంగా ఉండటం వెనుక మతలబు అర్థం కావట్లేదు. పిలిస్తే తప్ప స్వయంగా అడుగు పెట్టే పరిస్థితి లేదని, ఇదే పరిస్థితి మరో మంత్రికి కూడా ఉందని ఓవర్గం చెబుతోంది.


