News December 16, 2025

ADB: మూడో దశ ఎన్నికలకు 938 మంది పోలీసులతో బందోబస్తు: ఎస్పీ

image

ఆదిలాబాద్‌ జిల్లాలో ఆరు మండలాలలో జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. 37 క్లస్టర్లు, 25 రూట్లలో, 151 గ్రామాల పరిధిలోని 204 పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 938 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.

Similar News

News January 13, 2026

ఆదిలాబాద్: రూ.90 పెరిగిన పత్తి ధర

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,710గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర రూ.90 పెరిగినట్లు వెల్లడించారు.

News January 12, 2026

ADB: రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా జమునా నాయక్

image

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని దానోరా (బి) సర్పంచ్ జాదవ్ జమునా నాయక్ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సర్పంచుల సంఘం బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. క్రమశిక్షణతో పాటు రాష్ట్ర అభివృద్ధికై తోడ్పాటు చేస్తానని జమునా నాయక్ పేర్కొన్నారు.

News January 12, 2026

ఆదిలాబాద్: 19న కలెక్టరేట్ ఎదుట ధర్నా

image

ఈ నెల 19వ తేదీన ఆదిలాబాద్‌లోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ సభ్యుడు జాదవ్ సోమేశ్ తెలిపారు. నిరుద్యోగుల కోసం 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనే డిమాండుతో నిరసన చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలోని నిరుద్యోగ యువత హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.