News April 21, 2024
మణిపూర్‌లో 11 చోట్ల రీపోలింగ్

మణిపూర్‌లోని 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నిన్న లోక్‌సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్ సందర్భంగా ఖురై, క్షేత్రీగావ్‌తో పాటు మరో 3 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో పోలింగ్ కేంద్రాల వద్ద హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ కారణంగానే ఈ నెల 22న ఆయా కేంద్రాల్లో తిరిగి ఓటింగ్ ను నిర్వహించాలని ఈసీ ఆదేశించినట్లు తెలుస్తోంది.
Similar News
News March 5, 2026
సంజూ దూకుడు.. భారీ స్కోర్ దిశగా భారత్

T20WC: ఇంగ్లండ్‌పై సంజూ శాంసన్ దూకుడుగా ఆడుతున్నారు. ఇషాన్ కిషన్‌తో కలిసి సిక్సర్లు, బౌండరీలతో దుమ్మురేపుతున్నారు. పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసే సరికి భారత్ స్కోర్ 67/1గా ఉంది. అభిషేక్ 9 రన్స్ చేసి ఔటయ్యారు. సంజూ (40*), కిషన్ (16*) క్రీజులో ఉన్నారు. మరి 20 ఓవర్లలో టీమ్ ఇండియా ఎంత స్కోర్ చేస్తుందో కామెంట్ చేయండి.
News March 5, 2026
ఎక్కువ పిల్లల్ని కంటాం సరే.. ప్రభుత్వ సాయం ఏ మూలకు?

దేశంలో 1980-90s వరకు ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు మొగ్గుచూపేవారు. పెరిగిన ఖర్చులు, పేదరికంతో క్రమంగా ఒకరిద్దరు సంతానానికే పరిమితమయ్యారు. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యువతరం కొరత ఉంది. అందువల్ల ఎక్కువ మంది పిల్లలను కంటే ప్రోత్సాహకాలు ఇస్తామని AP CM CBN <<19304777>>ప్రకటించారు.<<>> అయితే విద్య, వైద్యం, కూడు, గూడు, గుడ్డ ఖరీదైన సమాజంలో ఈ సాయం ఏమాత్రం సరిపోతుందనేది అతిపెద్ద ప్రశ్న. మీరేమంటారు?
News March 5, 2026
అభిషేక్ మరోసారి ఫెయిల్

T20WCలో టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి ఫెయిల్ అయ్యారు. కీలకమైన సెమీఫైనల్లో రెండో ఓవర్లోనే భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చారు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ పైనా నిర్లక్ష్యపు షాట్ ఆడి 9 పరుగులకే ఔట్ కావడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఫైనల్‌కు వెళ్తే అతడిని పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ WCలో అభి 7 మ్యాచులు ఆడి 89 రన్స్ మాత్రమే చేశారు.


