News December 16, 2025
ఎట్టకేలకు అమ్ముడైన పృథ్వీ షా

యంగ్ బ్యాటర్ పృథ్వీషాకు ఎట్టకేలకు ఊరట దక్కింది. ఐపీఎల్-2026 మినీ వేలం తొలి రౌండ్‌లో షా అమ్ముడుపోలేదు. మరో రౌండ్‌లో బేస్ ప్రైస్ రూ.75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని సొంతం చేసుకుంది. గతంలో ఇతడు ఢిల్లీ తరఫునే ఆడారు. 79 మ్యాచుల్లో 1,892 రన్స్ చేశారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లు జేమీసన్‌ను రూ.2 కోట్లకు ఢిల్లీ, ఆడమ్ మిల్నేను రూ.2.4 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది.
Similar News
News December 25, 2025
DGP ఎంపికపై కీలక ఆదేశాలు

TG: తాత్కాలిక పద్ధతిలో రాష్ట్ర DGPగా శివధర్ రెడ్డి నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన నియామక ఉత్తర్వుల రద్దుకు నిరాకరించింది. అయితే DGP ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది. సీనియర్ ఐపీఎస్‌ల జాబితాను UPSCకి పంపించిన తర్వాత ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
News December 25, 2025
ఆస్టియోపోరోసిస్ ముప్పు ఎవరికి ఉంటుందంటే..

40 ఏళ్ల తర్వాత స్త్రీల శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. శరీరంలో విటమిన్ డి లోపం కూడా మొదలవుతుంది. ఈ కారణంగా ఎముకలు బలహీనంగా, మృదువుగా మారడం ప్రారంభిస్తాయి. చాలామంది మహిళల్లో బోలు ఎముకల వ్యాధి సమస్య ఈ వయసులోనే మొదలవుతుంది. సరైన జీవనశైలి లేని స్త్రీలు బోలు ఎముకల వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు బీపీ సమస్య కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
News December 25, 2025
TDPలో పదవుల జాతర!

AP: TDPలో ఒకేసారి 1,050 మందికి పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీల్లో పదవులు దక్కనున్నాయి. ఒక్కో కమిటీలో 9మంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యనిర్వహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, ట్రెజరర్, మీడియా కో-ఆర్డినేటర్, SM కో-ఆర్డినేటర్లు ఉంటారని సమాచారం. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో కలిపి కమిటీలో 42 మందిని నియమించనున్నారు. ఈ కమిటీల్లో మహిళలకు 28% కేటాయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


