News December 16, 2025

కామారెడ్డి: గుండెల్లో దడ.. లెక్కలు నిజమవుతాయా?

image

జిల్లాలో 3వ విడత GPఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈ ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనుంది. తమ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తెలియక, సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓటరు నాడి అంచనాకు దొరకకపోవడంతో, ఎవరు గెలుస్తారో? ఎవరు ఓడిపోతారో? అని వారి గుండెల్లో దడ మొదలైంది. తాము వేసిన లెక్కలు నిజమవుతాయా? అనే అనుమానం కూడా అభ్యర్థులను వెంటాడుతోంది.

Similar News

News January 14, 2026

జగిత్యాల: కేంద్రానికి స్పీడ్ పోస్టుల వినతులు

image

పెన్షనర్లకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశం ఆయన మాట్లాడుతూ.. 2026-27 కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో తమ గోడును వినిపించేందుకు ‘స్పీడ్ పోస్టు’ ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రికి వినతిపత్రాలు పంపినట్లు పేర్కొన్నారు.

News January 14, 2026

ఫ్యూచర్ సిటీలో సీఎం ‘నిశ్శబ్ద విప్లవం’

image

సిటీ అంటే హారన్ల గోల. కానీ ఫ్యూచర్ సిటీలో పక్షుల కిలకిలారావాలు వినొచ్చు. ఇది CM స్వయంగా దావోస్‌లో ప్రపంచానికి పరిచయం చేయబోతున్న శబ్దంలేని అద్భుతం. ఫ్యూచర్ సిటీని ఇండియాలోనే మొదటి ‘సైలెన్స్ జోన్’ నగరంగా మార్చే బ్లూప్రింట్ రెడీ అయింది. ఇందులో భాగంగా రెసిడెన్షియల్ జోన్లలో ‘నాయిస్ అబ్జార్బ్‌షన్ రోడ్లు’ వేయబోతున్నారు. అనవసరంగా హారన్ కొడితే AI డిటెక్టర్లతో నం. ప్లేట్ స్కాన్ అయ్యి చలాన్ జనరేట్ అవుతుంది.

News January 14, 2026

మేడారం గద్దెల వద్ద ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు..!

image

మేడారం మహా జాతరలో సమ్మక్క, సారలమ్మ గద్దెలో ప్రాంగణంలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. తల్లుల దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కరెంటు వైరు పలుచోట్ల తెగి కనిపించడంతో పాటు అతుకులుగా ఉన్నాయి. భక్తులు ఎవరైనా చూసుకోకుండా వాటిపై కాలు వేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.