News December 16, 2025
నెహ్రూ జూ పార్క్‌లో AI కమాండ్ కంట్రోల్ సెంటర్

నెహ్రూ జూ పార్క్ చరిత్రలో ఒక అద్భుతం జరగబోతోంది. త్వరలో AI కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అడవి బిడ్డల రక్షణలో ఇది సరికొత్త రికార్డు సృష్టించనుంది. AI సాయంతో జంతువుల ప్రతి కదలికను, వాటి ఆరోగ్యాన్ని 24/7 పర్యవేక్షించవచ్చు. ఏదైనా చిన్న మార్పు వచ్చినా ఈ స్మార్ట్ సెంటర్ వెంటనే హెచ్చరిస్తుంది. ప్రైవేట్ సౌండ్-ప్రూఫ్ టెక్నాలజీతో ఈ కేంద్రాన్ని నిర్మించడం విశేషం.
Similar News
News December 30, 2025
భువనగిరి జిల్లా తొలి ఎస్పీగా అక్షాంశ్ యాదవ్

యాదాద్రి భువనగిరి జిల్లా తొలి ఎస్పీగా అక్షాంశ్ యాదవ్ నియమితులయ్యారు. ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ పరిధిలోని కమిషనరేట్ల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా రాచకొండ పరిధిలోని భువనగిరి జోన్‌ను ప్రత్యేక పోలీస్ జిల్లాగా గుర్తిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న అక్షాంశ్ యాదవ్‌నే ప్రభుత్వం జిల్లా ఎస్పీగా నియమించింది.
News December 30, 2025
సమయం పెంపు.. రెండు రోజులు కిక్కే కిక్కు

AP: న్యూఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాల పని వేళలను ఎక్సైజ్ శాఖ పొడిగించింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్ముకునేందుకు మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చింది. బార్లు, ఇన్-హౌస్, ఈవెంట్లకు పర్మిట్ లైసెన్సులు ఉన్న వారికి రాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇచ్చింది. మరోవైపు రాష్ట్రంలోకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటు సారా రాకుండా అధికారిక పనివేళలు పెంచినట్లు తెలిపింది.
News December 30, 2025
2025లో ప్రకాశం జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాలు ఇవే.!

జూన్ 11న పొదిలికి YS జగన్ రాకతో ఉద్రిక్తత.
కల్తీ లడ్డూకు సంబంధించి సిట్ నోటీసులు అందుకున్న YV
కల్తీ మద్యం కేసులో చెవిరెడ్డి అరెస్ట్
ఒంగోలులో TDP లీడర్ వీరయ్య చౌదరి హత్య
వీరయ్య సతీమణికి గ్రంథాలయ ఛైర్మన్ పదవి
మార్కాపురం జిల్లాగా ప్రకటించిన CM
మాజీ MLA రాంభూపాల్ రెడ్డి కన్నుమూత
MLA ఉగ్రకు TDP అధ్యక్ష పదవి.


