News December 17, 2025

ఆదిలాబాద్: సమస్యలు సృష్టించే 756 మంది బైండోవర్

image

ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో గొడవలు సృష్టించే అవకాశం ఉన్న 756 మందిని బైండోవర్ చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 20 మంది వద్ద ఉన్న ఆయుధాలను కూడా సేఫ్ డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. మూడు విడతల బందోబస్తులో ఫారెస్ట్, టీజీఎస్‌పీ, ఏసీటీపీసీ సిబ్బంది పాల్గొంటున్నారని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Similar News

News January 16, 2026

ADB రిమ్స్‌లో పోస్టులకు దరఖాస్తులు

image

ADB రిమ్స్ వైద్య కళాశాలలో వివిధ విభాగంలో డాక్టర్ పోస్టులను గౌరవ వేతనంతో పాటు కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేస్తున్నట్లు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. అర్హులైన ట్యూటర్స్, సీఎంఓ, సివిల్ అసిస్టెంట్ సర్జన్, సీనియర్ రెసిడెంట్స్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. వివరాలకు rimsadilabad.org, adilabad.telangana.gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలన్నారు. ఈ నెల 23న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.

News January 15, 2026

సీఎం పర్యటన.. ఏర్పాట్ల పరిశీలన

image

భోరజ్ మండలం చనాక కొరాట వద్ద ఏర్పాటు చేసిన పంప్ హౌస్‌ను రేపు ప్రారంభించేందుకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని, ఆ మేరకు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఎస్పీ, కలెక్టర్ ఆదేశించారు.

News January 15, 2026

ఉట్నూర్: గిరిజన ఉద్యాన కేంద్రంలో తీరొక్క మొక్కలు

image

ఉట్నూర్ మండల కేంద్రంలో ఉన్న ఐటీడీఏ ప్రాంగణ ప్రాంతంలోని గిరిజన ఉద్యాన కేంద్రంలో అనేక రకాల మామిడి మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలను విక్రయిస్తున్నారు. ఇది ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇక్కడ అలంకరణ మొక్కలు, గిఫ్ట్ మొక్కలు బయటి కేంద్రంలో కంటే తక్కువ ధరలోనే దొరుకుతాయి. ఉట్నూర్ మండల ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.