News December 17, 2025
ఆదిలాబాద్: పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్: ఎస్పీ

పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు అనవసరంగా గుమిగూడరాదని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. 100 మీటర్లు, 200 మీటర్ల దూరంలో ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయని, వాటిని తప్పక పాటించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, వాటర్ బాటిళ్లు, ఆయుధాలు, పెన్నులు వంటి వాటికి అనుమతి లేదన్నారు. క్యూ లైన్ పద్ధతి పాటించాలని ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News March 15, 2026
ADB: కుప్ప కూలిన టెంట్.. తప్పిన ప్రమాదం

జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన హీరా సుకా జయంతి వేడుకల సందర్భంగా భోజనం కోసం ఏర్పాటు చేసిన టెంటు గాలికి కుప్ప కూలింది. ఆ సమయంలో భోజనాలు ప్రారంభం కాకుండా ఆ టెంటు కింద కొంత మంది మాత్రమే ఉండడంతో ప్రమాదం తప్పింది. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే చిన్నపాటి గాలికి టెంటు కుప్ప కూలిందని ఆదివాసీ పర్ధాన్ వాపోయారు.
News March 14, 2026
పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

జిల్లాలో ప్రతిపాదించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సంబంధించిన భూ సేకరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉందన్నారు.
News March 14, 2026
థర్డ్ పార్టీ అప్లికేషన్లపై అప్రమత్తంగా ఉండాలి: ADB SP

తెలియని థర్డ్ పార్టీ అప్లికేషన్లను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా SP అఖిల్ మహాజన్ సూచించారు. వీటి ద్వారా డాటా చోరీ, మొబైల్ హ్యాకింగ్, ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఈ వారం 14 సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయి. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.


