News April 21, 2024
ప్రకాశం: చెవిరెడ్డి ఆస్తుల వివరాలివే

ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ఆర్వోకు సమర్పించారు. 11 క్రిమినల్ కేసులు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. 2022-23లో వార్షిక ఆదాయం రూ.24,04,909గా చూపించారు. ప్రస్తుతం చేతిలో రూ.66 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. స్థిరాస్తులు రూ.4.20 కోట్లు, చరాస్తులు రూ.118 కోట్లుగా చూపించారు.
Similar News
News September 10, 2025
రెండు రోజుల్లో లిక్కర్ స్కామ్‌పై ఛార్జ్ షీట్..!

రెండు రోజుల్లో లిక్కర్ స్కామ్‌పై సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేతల చెవిరెడ్డి భాస్కర్, MP మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్.. వారికి బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే MPకి మధ్యంతర బెయిల్ మంజూరైంది. మరోవైపు మోహిత్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణ స్వామి, విజయానంద రెడ్డిపై సిట్ విచారణ చేపట్టింది. దీంతో వీరి భవితవ్యం ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది.
News September 10, 2025
తర్లుపాడు MPDOపై సస్పెన్షన్ వేటు

తర్లుపాడు MPDO చక్రపాణి ప్రసాద్‌పై పబ్లిక్ సర్వీసెస్ జిల్లా అధికారులు వేటు వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కంటింజెంట్ వర్కర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చక్రపాణిపై దర్యాప్తు జరిపి ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. MPDOపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. కమిటీ విచారణ, ప్రాథమిక సాక్ష్యంతో సస్పెండ్ చేశారు.
News September 10, 2025
ప్రకాశం: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రకాశం జిల్లా దొనకొండ వాసులకు MP మాగుంట శ్రీనివాసులరెడ్డి శుభవార్త చెప్పారు. ఇకపై దొనకొండ రైల్వే స్టేషన్‌లో 3 ప్రధాన రైళ్లు ఆగనున్నాయి. గత నెలలో రైల్వే GMకు MP మాగుంట దొనకొండ, కురిచేడులలో పలు రైళ్లు నిలుపుదల చేయాలని కోరారు. ఈ మేరకు రైల్వే అధికారులు దొనకొండలో అమరావతి ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్, వాస్కోడిగామా, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లను నిలుపుదల చేస్తున్నట్లు మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది.