News April 21, 2024
24న మిర్యాలగూడకు కేసీఆర్: భాస్కర్ రావు

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ MP అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మిర్యాలగూడ మాజీ MLA నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. మిర్యాలగూడలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 24న బీఆర్ఎస్ చీఫ్, మాజీ సిఎం కేసీఆర్ పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని తెలిపారు. కేసీఆర్ శ్రీకారం చుట్టనున్న రోడ్ షో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ప్రారంభం కానుందని తెలిపారు.
Similar News
News March 11, 2026
నల్గొండ: అప్పు విషయంలో గొడవ ప్రాణం తీసింది

అప్పు విషయంలో జరిగిన గొడవ ఒకరి ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఆంజనేయులు, శంభు లింగం మధ్య అప్పు విషయంలో ఘర్షణ తలెత్తింది. శంభు లింగంకు తీవ్రగాయాలు కావడంతో ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శంభు లింగం మరణించాడు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
News March 10, 2026
నల్గొండ: పెండింగ్ పనులను పూర్తి చేయాలి : కలెక్టర్

జిల్లాలో ప్రాధాన్యత క్రమంలో పెండింగ్ భూసేకరణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్డీవోలు, ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భూసేకరణలో జాప్యం లేకుండా చూడాలని, ప్రాజెక్టులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ అమిత్, ఆర్డీవోలు పాల్గొన్నారు.
News March 10, 2026
గంజాయి సేవిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి: SP శరత్ చంద్ర

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ స్థాయిలో రహదారి భద్రత కమిటీలను ఏర్పాటు చేసుకొని రోడ్డు ప్రమాదాల విషయాలపై చర్చించాలని ఎస్పీ శరత్ చంద్ర పవర్ సూచించారు. నకిరేకల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించి సమాచారం తెలిస్తే తక్షణమే 8712670266 నంబర్‌కి ఫోన్ చేసి తెలియజేయాలని, గత సంవత్సరం జిల్లాలో 53 గంజాయి కేసులు నమోదు చేశామని తెలిపారు.


