News December 17, 2025
కోనసీమ: ఏడాది పాటు రుసుము రద్దు.. అప్‌డేట్ చేసుకోండి

5 నుంచి 17 ఏళ్లలోపు విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలని అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. మంగళవారం ఆయన అమలాపురం కలెక్టరేట్‌లో మాట్లాడారు. కేంద్ర నిబంధనల మేరకు ఈ సేవలకు సంబంధించిన రుసుమును ఏడాది పాటు పూర్తిగా రద్దు చేసినట్లు వెల్లడించారు. విద్యాసంస్థలు ఈ విషయంపై శ్రద్ధ వహించి, విద్యార్థులందరితో అప్‌డేట్ చేయించాలని ఆదేశించారు.
Similar News
News January 1, 2026
UPలో BJPకి దడపుట్టిస్తున్న SIR

SIR ప్రక్రియ UPలో BJPకి సవాల్‌గా మారింది. రద్దయ్యే 18.7% ఓట్లలో ఆ పార్టీకి పట్టున్న లక్నో, ఘజియాబాద్, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్ ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నాయి. SIR డ్రాఫ్ట్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం 12.55 CR ఓట్లుంటాయని అంచనా. అయితే 25CR రాష్ట్ర జనాభాలో 65% అంటే 16 CR ఓటర్లుండాలని, మిగతా 4 CR మంది జాబితాలో చేరని వారేనని BJP భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించింది.
News January 1, 2026
తిరుమలలో నేటి రాత్రి నుంచే FREE దర్శనం

లక్కీడిప్ టోకెన్లు ఉన్న భక్తులకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. సర్వ దర్శనం(టోకెన్లు లేకుండా ఫ్రీ ఎంట్రీ) నేటి రాత్రి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే TTD సర్వదర్శనం క్యూ లైన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆక్టోపస్ సర్కిల్ నుంచి లైన్ తీసుకోనున్నారు. రద్దీని బట్టి సాయంత్రం నుంచే టోకెన్లు లేని భక్తులను క్యూలోకి అనుమతించే అవకాశం ఉంది. CRO దగ్గర రూములు తీసుకోవచ్చు.
News January 1, 2026
మినుములో మారుకా మచ్చల పురుగు వల్ల కలిగే నష్టం

మారుకా మచ్చల పురుగు మొగ్గ, పూత, పిందె దశల్లో మినుము పంటను ఆశించి ఎక్కువగా నష్టం కలగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు వాటిని దగ్గరకు జేర్చి గూడుగా కట్టి, కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినటంవలన పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది. ఈ తెగులును సకాలంలో గుర్తించి చర్యలు తీసుకోకపోతే తీవ్ర నష్టం తప్పదు.


