News December 17, 2025

అద్దంకి: ఫైనాన్స్ వాయిదాల గొడవ.. వ్యక్తిపై దాడి

image

ఓ ఆటో ఫైనాన్స్ వాయిదాల విషయమై జరిగిన గొడవలో ఓ వ్యక్తిపై దాడి జరిగినట్లు మంగళవారం C.I సుబ్బరాజు తెలిపారు. చెరువుకొమ్మపాలెం చెందిన ప్రసన్నాంజనేయులు (34) అనే వ్యక్తిపై ముగ్గురు ఫైనాన్స్ సిబ్బంది వాగ్వాదానికి దిగి దాడి చేసినట్లు తెలిపారు. ఘటనలో ప్రసన్నాంజనేయులు తలకు, మోకాలిపై గాయాలయ్యాయి. వ్యక్తిని అద్దంకి PHC తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశామని C.I అన్నారు.

Similar News

News April 6, 2026

అన్నమయ్య జిల్లాలో దారుణ హత్య

image

అన్నమయ్య (D) చౌడేపల్లి (M) బోయకొండ అటవీ ప్రాంతంలో సోమవారం అమానుష ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి ఓ వ్యక్తిని హత్య చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో విచారణ చేపట్టినట్లు పుంగనూరు రూరల్ CI సాయి ప్రసాద్, SI చిన్నరెడ్డప్పలు తెలిపారు.

News April 6, 2026

వసతి గృహాలకు వాటర్ ప్యూరిఫైర్ల పంపిణీ

image

సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన నాలుగు వాటర్ ప్యూరిఫైర్లను సోమవారం ఆయన ప్రారంభించారు. వీటిని కదిరి ప్రాంతంలోని మూడు బీసీ, ఒక ఎస్సీ హాస్టళ్లకు పంపిణీ చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు.

News April 6, 2026

భర్తను కాదని నచ్చిన వాడితో ఉండేందుకు అనుమతించిన కోర్టు

image

పెళ్లయిన 19 ఏళ్ల మహిళ తన భర్త, తల్లిదండ్రులతో ఉండటానికి నిరాకరించిన కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 40 ఏళ్ల భర్త నుంచి విడిపోయి, తనకిష్టమైన భాగస్వామితో ఉంటానన్న ఆమె నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. మేజర్ అయిన వ్యక్తికి తన ఇష్టప్రకారం జీవించే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ ఇచ్చినా, ఫ్యామిలీ ఒత్తిడి చేసినా సదరు మహిళ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడం గమనార్హం.