News December 17, 2025
TTDలో కొత్త ఉద్యోగాలు..!

TTDలో త్వరలో కొత్త ఉద్యోగాలు రానున్నాయి. శ్రీవారి పోటులో కొత్తగా 18 పోటు సూపర్‌వైజర్(పాచక) పోస్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని TTD కోరింది. ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 60 పోస్ట్‌లను పాత నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేయడానికి TTD గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీవారి ఆలయంలో ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.
Similar News
News January 8, 2026
క్రమ పద్ధతిలో హిందువులపై దాడులు: షేక్ హసీనా

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. అక్కడ మైనారిటీలపై ఒక క్రమ పద్ధతిలో దాడులు జరుగుతున్నాయని NDTVతో చెప్పారు. ఈ హింసను యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వమే అనుమతిస్తోందని ఆరోపించారు. ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. శిక్ష పడుతుందనే భయం దోషుల్లో లేకుండా పోయిందన్నారు.
News January 8, 2026
ఉప్పలపాడులో పాస్ పుస్తకాలను అందజేసిన కలెక్టర్

ముదిగుబ్బ మండలం ఉప్పలపాడులో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. భూ రికార్డుల పారదర్శకతతో రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
News January 8, 2026
HYD: RTC స్పెషల్ బస్సులు.. 50% స్పెషల్ రేట్లు

సిటీ నుంచి సంక్రాంతికి సొంతూరికి వెళ్లేందుకు నగరవాసి సిద్ధమవుతున్నాడు. అయితే ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపుతున్న బస్సుల్లో ప్రత్యేక బస్సుల్లో ప్రత్యేక టికెట్ ధరలు ఉంటాయి. అంటే అదనంగా 50% వసూలు చేస్తారన్నమాట. పండగ సమయాల్లో అదనపు ఛార్జీ వసూలుకు సంబంధించి గతంలోనే ప్రభుత్వం అనుమతులిస్తూ జీవో 50 జారీ చేసింది. ఈ మేరకు స్పెషల్ రేట్స్ ఉంటాయి. అయినా.. అవసరం ప్రజలది.. అవకాశం పాలకులది కదా.


