News December 17, 2025

తాడ్కోల్: వయసును ఓడించి.. ఓటు వేసిన వృద్ధురాలు

image

ఓటు హక్కు ప్రాధాన్యతను చాటుతూ తాడ్కోల్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు లక్ష్మి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎర్రమ్మకుచ్చు కాలనీకి చెందిన ఆమె, నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ వీల్ ఛైర్‌పై పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆమె మాట్లాడుతూ.. “నడవలేని స్థితిలో ఉన్నా నేను నా బాధ్యతను నెరవేర్చాను. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు వేయాలి” అని పిలుపునిచ్చారు.

Similar News

News January 8, 2026

KU: డబుల్ పీజీ విద్యార్థులకు హాస్టల్ అడ్మిషన్లు రద్దు

image

డబుల్ పీజీ చదువుతున్న విద్యార్థులు యూనివర్సిటీ హాస్టల్స్ అడ్మిషన్లకు అర్హులు కాదని కేయూ హాస్టల్స్ డైరెక్టర్ ఎల్సీ రాజ్‌కుమార్ బుధవారం స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి హాస్టల్‌లో చేరిన విద్యార్థులు ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అడ్మిషన్ రద్దు చేసుకోవాలని సూచించారు. గడువు దాటితే హాస్టల్ అడ్మిషన్ రద్దుతో పాటు డిపాజిట్ మనీ తిరిగి చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.

News January 8, 2026

భూపలపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష

image

జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్‌లోని గురువారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ గృహాల గృహ నిర్మాణాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ఇందిరమ్మ గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. మున్సిపల్, ఎంపిడివోలు, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లదారు. అదనపు కలెక్టర్ విజయలక్మి, లోక్ నాయక్ ఉన్నారు.

News January 8, 2026

జిల్లా మలేరియా అధికారిగా నాగార్జున

image

జిల్లా మలేరియా నూతన అధికారిగా నాగార్జున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన జిల్లా వైద్యశాఖ అధికారి విజయమ్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అధికారుల ఆదేశాలను పాటిస్తూ తనకు కేటాయించిన లక్ష్యాలను సమర్ధవంతంగా నెరవేరుస్తానని ఆయన అన్నారు. నూతన వైద్యాధికారికి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.