News April 21, 2024
నేడు ప.గో.లో పవన్ ప్రచారం.. షెడ్యూల్ ఇదే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ప.గో జిల్లాలో
పర్యటించనున్నారు. సాయంత్రం 5గంటలకు నరసాపురం మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం ముత్యాలపల్లి, లోసరి, బర్రెవానిపేట, గొల్లవానితిప్ప గ్రామాల మీదుగా భీమవరం పట్టణానికి చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు ప్రకాశం చౌక్‌లో జరిగే బహిరంగ సభలో వారాహి పైనుంచి మాట్లాడుతారు. రాత్రి స్థానిక నిర్మలాదేవి ఫంక్షన్‌హాల్‌లో బస చేస్తారు.
Similar News
News March 13, 2026
ప.గో : వైసీపీ నియోజకవర్గ పరిశీలకుల నియామకం

పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు వైసీపీ పరిశీలకులను నియమించింది. శుక్రవారం రాత్రి ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నియామక ఉత్తర్వులను జారీ చేసింది. యడ్ల తాతాజీ (ఆచంట), పేరిచర్ల విజయ నరసింహారాజు (పాలకొల్లు), ముప్పిడి సంపత్ కుమార్ (నర్సాపురం) ఫొటో, కొట్టు నాగేంద్ర (తణుకు) ఫొటో, వేండ్ర వెంకటస్వామి (తాడేపల్లిగూడెం), ఏఎస్. రాజు (ఉండి) నియమితులయ్యారు.
News March 13, 2026
తాడేపల్లిగూడెం: మూడు బార్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో 3 జనరల్ కేటగిరి బార్ లైసెన్స్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈనెల 25 ఉదయం 8 గంటలకు భీమవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో లక్కీ డ్రా తీయనున్నట్లు వివరించారు.
News March 13, 2026
పర్యాటకాభివృద్ధిపై దృష్టి: కలెక్టర్

సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన గురువారం జరిగిన రెండో రోజు కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ సి.నాగరాణి పాల్గొన్నారు. పర్యాటకాభివృద్ధిపై చర్చ సందర్భంగా.. జిల్లాలో ప్రభుత్వ భూముల కొరతను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. హోటళ్ల నిర్మాణానికి అనువుగా రెండు చోట్ల ఆర్‌అండ్‌బీ స్థలాలను గుర్తించి, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్‌కు ప్రతిపాదనలు పంపినట్లు ఆమె ఈ సమావేశంలో వివరించారు.


