News December 17, 2025
మంచిర్యాల జిల్లాలో 27.15% పోలింగ్

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కొనసాగుతున్న 3వ విడత పోలింగ్ ఉదయం 9గంటల వరకు 27.15శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మందమర్రిలో 34.92%, చెన్నూర్27.27%, కోటపల్లి 28.63%, జైపూర్ 23.96%, భీమారంలో 24.81%, నమోదయినట్లు అధికారులు వివరించారు. పోలింగ్ బూతుల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లందరూ ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News January 5, 2026
ప.గో: లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

పాలకొల్లుకు చెందిన ప్రేమికులు రమేశ్, భాగ్యశ్రీ ఆదివారం తాళ్లరేవు మండలం సుంకరపాలెంలోని ఓ లాడ్జిలో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన యాజమాన్యం కోరంగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని చికిత్స కోసం యానం ఆసుపత్రికి తరలించారు. ఈ నెల ఒకటో తేదీన వారు గది తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎస్ఐ సత్యనారాయణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 5, 2026
OTTలోకి ‘ధురంధర్’.. ఎప్పుడంటే?

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1200కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇండియాలో రూ.800కోట్లకు పైగా కలెక్ట్ చేసిన తొలి హిందీ సినిమాగా ‘ధురంధర్’ నిలిచింది. ఇందులో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటనకు ప్రశంసలొచ్చాయి.
News January 5, 2026
తూ.గో: ఎస్‌సీ రుణగ్రహీతలకు బంపర్ ఆఫర్.. వడ్డీ మాఫీ

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎస్‌సీ లబ్ధిదారులకు ప్రభుత్వం వడ్డీ మాఫీ అవకాశం కల్పించిందని ఈడీ సత్యవతి సోమవారం తెలిపారు. NSFDC, NSKFDC పథకాల కింద రుణం పొందిన వారు 2026 ఏప్రిల్ 30 లోపు అసలు చెల్లిస్తే, 2025 డిసెంబర్ 31 వరకు పేరుకుపోయిన వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. బకాయిలు చెల్లించి ఆర్థిక వెసులుబాటు పొందాలని సూచించారు.


