News December 17, 2025
ఇందల్వాయి హత్య.. పోలీసుల అదుపులో అనుమానితులు

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవితండా సమీపంలో ఓ దాబా వద్ద నిన్న మహ్మద్ సల్మాన్ అనే <<18587725>>లారీ డ్రైవర్ <<>>హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాల్పుల్లో సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడని ప్రచారం జరగగా అనుమానితులను ఇందల్వాయి పోలీసులు అదుపులో తీసుకున్నారు. చంద్రయన్ పల్లి వద్ద నిందితులు కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News January 14, 2026
కరీంనగర్ జిల్లాలో 2,292 టన్నుల యూరియా నిల్వలు

కరీంనగర్ జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. గత 15 రోజుల్లో వివిధ సొసైటీల ద్వారా 8,124 మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో మరో 2,292 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, అవసరానికి అనుగుణంగా అదనపు స్టాక్‌ను తెప్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
News January 14, 2026
నేడు రెండో వన్డే.. సిరీస్‌పై టీమ్ ఇండియా గురి

నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. 3 ODIల సిరీస్‌లో ఇప్పటికే ఒకటి టీమ్ ఇండియా గెలవగా రెండోది కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్‌లో అదరగొట్టారు. ఇక కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అదే విధంగా బౌలర్లు కూడా రాణిస్తే సిరీస్ మనదే అవుతుంది. మ్యాచ్ మధ్యాహ్నం 1.30 నుంచి JioHotstar, Star Sportsలో వస్తుంది.
News January 14, 2026
ఎమ్మెల్యే పీఎస్ఆర్‌కు డిప్యూటీ సీఎం లేఖ

రాష్ట్రంలో విద్యుత్ పరంగా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కోరారు. ఈ మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు పంపిన లేఖను స్థానిక విద్యుత్ శాఖ అధికారులు మంగళవారం అందజేశారు. విద్యుత్ శాఖ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, త్వరలో జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.


