News December 17, 2025
పెద్దకొడప్గల్: ఓటు వేయడానికి వస్తూ అనంతలోకాలకు..

ఎన్నికల్లో ఓటు వేయడానికి స్వగ్రామానికి వస్తున్న బిచ్కుంద (M) పుల్కల్ వాసి బక్కోల సాగర్ (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సాగర్ మంగళవారం HYD నుంచి మరో వ్యక్తితో కలిసి బైక్‌పై పుల్కల్ బయలుదేరాడు. అయితే, బుధవారం పెద్ద కొడప్గల్ PS పరిధిలోని హైవేపై శవమై కనిపించాడు. మరొకరు తీవ్రగాయాలై కనిపించగా అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
Similar News
News January 17, 2026
NLG: రైతులకు మళ్లీ మొండి చేయేనా!

సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని ఊరించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు స్పందించకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఈ యాసంగిలో జిల్లాలో 6.57 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. సంక్రాంతికి రైతు భరోసా విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో మొండి చేయి చూపించడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. దీంతో అప్పుల కోసం రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
News January 17, 2026
హుస్నాబాద్హుస్నాబాద్: వెయ్యేళ్ల నాటి అరుదైన శిల్పాలు

హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని ఎల్లమ్మ వాగులో పురాతన శిల్పాలు బయటపడ్డాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ వీటిని గుర్తించారు. 11వ శతాబ్దానికి చెందిన నల్లరాయితో చెక్కిన ధ్యానముద్రలోని విగ్రహం ఇక్కడ లభ్యమైంది. గతంలో మల్లన్న దేవాలయం సమీపంలో ఉన్న వీటిని వాగులో పడేసినట్లు చరిత్ర పరిశోధకులు గుర్తించారు. ఈ అరుదైన శిల్పాలు ప్రస్తుతం స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
News January 17, 2026
ఎల్లారెడ్డి: తండ్రిపై కొడుకు కత్తితో దాడి

ఎల్లారెడ్డి(M) గండి మాసానిపేటలో ఆస్తి చిచ్చు తండ్రీ కొడుకుల మధ్య రక్తపాతానికి దారితీసింది. ఆస్తి పంపకాల విషయంలో తలెత్తిన వివాదంతో కన్నకొడుకే తండ్రిపై కత్తితో దాడి చేసిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ దాడిలో చంద్రయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది EMT బాలరాజ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.


