News December 17, 2025
గుడిహత్నూర్: స్కూటీపై వచ్చి ఓటేసిన 85 ఏళ్ల బామ్మ

గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ 85 ఏళ్ల బామ్మ ప్రజాస్వామ్యంపై తనకున్న మక్కువను చాటుకున్నారు. వయసు భారంతో ఉన్న శారీరక ఇబ్బందులను లెక్కచేయకుండా, ఆమె స్వయంగా స్కూటీపై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె స్ఫూర్తిని చూసి స్థానికులు, ఎన్నికల సిబ్బంది అభినందనలు తెలిపారు. ఓటు హక్కు ప్రాముఖ్యంపై ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచారని అధికారులు పేర్కొన్నారు.
Similar News
News April 2, 2026
జయంతి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ రాజర్షి షా

ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్, 14న అంబేడ్కర్ జయంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మహనీయుల జీవిత చరిత్రపై ఫొటో ఎగ్జిబిషన్, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలన్నారు. వేడుకల ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ దీపాలు, పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు.
News April 2, 2026
దివ్యాంగులకు ఊరట.. ఒకేచోట వైకల్య నిర్ధారణ పరీక్షలు: కలెక్టర్

రిమ్స్‌లోని క్రిటికల్ కేర్ సెంటర్‌లో దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వైకల్య నిర్ధారణ పత్రాల కోసం గతంలో దివ్యాంగులు పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, అన్ని రకాల వైద్య పరీక్షలు ఒకే చోట జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. నిపుణులైన వైద్య బృందం, ఆధునిక పరికరాలను ఇక్కడ అందుబాటులో ఉంచామని, దీనివల్ల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ సులభతరం అవుతుందన్నారు.
News April 2, 2026
ADB: ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన కలెక్టర్

ఇచ్చోడ మండలంలోని కామగిరి గ్రామంలో లబ్ధిదారురాలు కడదారపు పద్మిని నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారురాలితో గృహ ప్రవేశం చేయించిన ఆయన, పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


