News April 21, 2024
నేడు భువనగిరిలో సీఎం పర్యటన

TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి జోరు పెంచారు. ఇవాళ ఆయన భువనగిరిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్‌కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతను పటిష్ఠం చేశారు. కాగా నిన్న మెదక్ పర్యటనలో మోదీ, కేసీఆర్‌పై రేవంత్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
Similar News
News January 19, 2026
అలా అయితే మేమూ T20 WC ఆడబోం.. పాక్ వితండవాదం!

T20 WC విషయంలో ఇప్పటికే బంగ్లా లేనిపోని రాద్ధాంతం చేస్తుంటే తాజాగా పాక్ అందుకు వంత పాడుతోంది. బంగ్లాను ఇండియాలో ఆడాలని ICC ఫోర్స్ చేస్తే, తాము కూడా టోర్నీ నుంచి తప్పుకొంటామంటూ వితండవాదానికి దిగింది. బంగ్లాదేశ్ అభ్యర్థన న్యాయమైందని, వారిపై ఒత్తిడి తేవొద్దంటూ లేనిప్రేమ ఒలకబోస్తోంది. ఈ మేరకు పాక్ క్రికెట్ బోర్డులోని విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ అక్కడి మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.
News January 19, 2026
కుందేళ్ల షెడ్డు నిర్మాణములో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కుందేళ్ల షెడ్‌ను ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలి. గాలి ఎక్కువగా తగిలేలా చూసుకోవాలి. షెడ్‌ను తూర్పు, పడమర దిశలో కట్టాలి. షెడ్ పరిసరాల్లో శబ్దకాలుష్యం లేకుండా చూడాలి. శబ్దాల వల్ల కుందేళ్లు భయపడి వాటి ఉత్పాదక సామర్థ్యం తగ్గే ఛాన్సుంది. షెడ్డు లోపల చల్లని వాతావరణం ఉండాలి. షెడ్డు ఉష్ణోగ్రత ఎండాకాలంలో 30 డిగ్రీల సెల్సియస్ దాటకుండా.. చలికాలంలో 20 డిగ్రీల సెల్సియస్ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
News January 19, 2026
ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ అడవులు మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లాయి. నేషనల్ పార్క్ సమీపంలో పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఆరుగురు మావోలు మరణించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.


