News April 21, 2024
SRH.. ప్రపంచ రికార్డులు

నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో SRH పలు ప్రపంచ రికార్డులు సాధించింది. పవర్ ప్లేలో అత్యధిక బౌండరీలు(24), అత్యధిక సిక్సర్లు(11) కొట్టిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో 2014లో సస్సెక్స్‌పై శ్రీలంక కొట్టిన 20 బౌండరీల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. అలాగే అత్యంత వేగంగా(8.4 ఓవర్లు) 150 రన్స్ చేసిన జట్టుగా, తొలి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు(158) చేసిన టీమ్‌గా SRH ఘనత సాధించింది.
Similar News
News March 19, 2026
కొత్త డీజీపీ రేసులో ముగ్గురు!

TG: డీజీపీ నియామకానికి అర్హులైన ముగ్గురు అధికారుల లిస్టు రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. సీవీ ఆనంద్(1991 బ్యాచ్), వినయ్ ప్రభాకర్ ఆప్టే(1994 బ్యాచ్), సౌమ్యా మిశ్రా(1994 బ్యాచ్)తో కూడిన ఫైనల్ లిస్టును యూపీఎస్సీ పంపింది. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీవీ ఆనంద్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. డీజీపీ శివధర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్ 30తో ముగియనుంది.
News March 19, 2026
ALERT: ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని APSDMA హెచ్చరించింది. శ్రీకాకుళం, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, NLR, కర్నూలు, నంద్యాల, ATP, సత్యసాయి, కడప, చిత్తూరు, TPTYలో తేలికపాటి-మోస్తరు వర్షాలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. కాగా చిత్తూరు, కడపలోని పలు ఏరియాల్లో ఇప్పటికే వర్షం కురుస్తోంది.
News March 19, 2026
వచ్చే నెలలో క్యాబినెట్ విస్తరణ!

TG: ఏప్రిల్ తొలి వారంలో రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతించిందని తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రివర్గంలో ఖాళీల భర్తీ, ఒకరిద్దరు కొత్త వారిని తీసుకోవడంపై అధిష్ఠానంతో CM రేవంత్ చర్చించారని సమాచారం. పలువురి శాఖలు మార్చేందుకూ పర్మిషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తరచూ వివాదాస్పదమవుతున్న మంత్రిపై వేటు పడుతుందని, కొత్తగా లంబాడా నేతకు ఛాన్స్ దక్కనుందని చర్చ సాగుతోంది.


