News December 17, 2025

అమ్రాబాద్‌లో ‘కనిష్ఠం’.. 11.9 డిగ్రీల ఉష్ణోగ్రత

image

జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్ మండల కేంద్రంలో అత్యల్పంగా 11.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిన్నటితో పోలిస్తే చలి స్వల్పంగా తగ్గినప్పటికీ, రాత్రివేళల్లో చలి పులి వణికిస్తూనే ఉంది.
అమ్రాబాద్ 11.9
తోటపల్లి (కల్వకుర్తి) 12.2
కొండారెడ్డిపల్లి (బల్మూరు) 13.3
తెలకపల్లి 13.5
సిర్సనగండ్ల (చారకొండ) 13.9
వెల్దండ 14.0
పదర 14.2

Similar News

News December 29, 2025

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. వాళ్లిద్దరికీ రెస్ట్?

image

న్యూజిలాండ్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్లు హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే T20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చని cricbuzz తెలిపింది. అయితే ODIలకు దూరమైనా NZతో 5T20ల సిరీస్‌లో మాత్రం ఆడతారని పేర్కొంది. జనవరి 11-31 మధ్య 3 ODIలు, 5T20లు జరగనున్నాయి. ODIల్లో వెటరన్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీ ఆడనున్నారు.

News December 29, 2025

ఏడు కురచలు చూచి ఎద్దును కొనాలి(1/2)

image

పూర్వం ట్రాక్టర్లు లేని కాలంలో వ్యవసాయానికి ఎద్దులే ఆధారం. ఒక ఎద్దు పనికి వస్తుందో లేదో దాని శారీరక లక్షణాలను బట్టి అప్పటి అనుభవజ్ఞులైన రైతులు అంచనా వేసేవారు. ఈ సామెతలోని “ఏడు కురచలు” అంటే ఎద్దుకు ఉండాల్సిన ఏడు పొట్టి (చిన్న) అవయవాలు. మెడ, తోక, చెవులు, కొమ్ములు, ముఖం, వీపు, గిట్టలు పొట్టిగా లేదా చిన్నగా ఉన్న ఎద్దును కొనాలని నాడు పెద్దలు చెప్పేవారు.

News December 29, 2025

హైదరాబాద్ ESICలో 102 పోస్టులు.. నేటి నుంచి ఇంటర్వ్యూలు

image

<>HYD <<>>సనత్‌నగర్‌లోని ESIC హాస్పిటల్‌ 102 ఫ్యాకల్టీ, Sr. రెసిడెంట్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నేటి నుంచి JAN 7వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. పోస్టును బట్టి MBBS, MCh, DM, DNB, MD అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ప్రొఫెసర్‌కు నెలకు రూ.2.56లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1.70లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.46లక్షలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in