News December 17, 2025

మెదక్: సమయం లేదు ఓటరన్నా.. పరిగెత్తు..!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ క్లైమాక్స్‌కు చేరుకుంది. మధ్యాహ్నం 1 గంటకే సమయం ఉండటంతో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. క్యూలైన్‌లో ఉన్న వారికే ఓటు వేసే అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి వాహనాలు ఏర్పాటు చేసి, బస్సు ఛార్జీలు ఇచ్చి మరీ పిలిపిస్తున్నారు. గడువు ముగిసేలోపు తమ మద్దతుదారులందరితో ఓటు వేయించేందుకు అభ్యర్థులు ఆఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.

Similar News

News January 14, 2026

WGL: సూర్యభగవానుడి ఆశీస్సులే భోగి పండ్లు..!

image

సంక్రాంతి సంబరాల్లో భాగంగా నేడు భోగి పండగను ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారు. భోగి మంటలతో చలిని తరిమికొట్టే వేడుక ఒకెత్తయితే, చిన్నారుల తలపై భోగి పండ్లు పోయడం ఈ పండగలోని మరో ప్రధాన ఘట్టం. రేగు పండ్లకు అర్కఫలం అనే విశిష్ఠమైన పేరు ఉంది. అర్కుడు అంటే సూర్యుడు అని అర్థం. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లే సమయం కాబట్టి ఆయన కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పోస్తారు.

News January 14, 2026

గర్భిణుల్లో విటమిన్ D లోపం ఉంటే ఈ సమస్యలు

image

ప్రెగ్నెన్సీలో మహిళలు అన్ని పోషకాలు అందేలా ఆహారం తీసుకోవాలి. అప్పుడే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. పుట్టుక‌తో ఎలాంటి లోపాలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా గ‌ర్భిణుల్లో విట‌మిన్ డి లోపం ఉండ‌డం వ‌ల్ల శిశువులు అధిక బ‌రువు, గుండె జ‌బ్బులు, మ‌ల్టిపుల్ స్లెరోసిస్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి విటమిన్ D లోపం లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

News January 14, 2026

ఖమ్మం: విభేదాలు వీడి.. ఎర్రజెండాలు ఏకమయ్యేనా?

image

కమ్యూనిస్టుల కంచుకోట ఖమ్మం జిల్లాలో ఎర్రజెండా పార్టీల మధ్య సఖ్యత లేకపోవడంతో ఆయా పార్టీల ప్రభావం తగ్గుతోందన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. CPI, CPM, CPI ML, CPI ML న్యూడెమోక్రసీ, తదితర కమ్యూనిస్టు పార్టీల మధ్య విభేదాలు బలాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే CPI శతాబ్ది ఉత్సవాల వేదికగానైనా కమ్యూనిస్టు నేతలంతా ఒక్కతాటిపైకి వస్తారా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.