News December 17, 2025
విజయోత్సవాలకు అనుమతి లేదు: వరంగల్ సీపీ

మూడో విడత ఎన్నికలకు సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎలాంటి ఆటంకాలు కలగకుండా సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకున్నారని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ముఖ్యంగా కౌంటింగ్ అనంతరం జరుపుకునే విజయోత్సవాలకు సంబంధించి ఎలాంటి అనుమతి లేదని, అలాంటి వాటికి తప్పనిసరిగా పోలీసుల అధికారుల అనుమతి తీసుకోవాలని అన్నారు.
Similar News
News January 11, 2026
కడప: టెన్త్ అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్

YSR కడప జిల్లాలోని GGH, CCCలో 34 పోస్టుల భర్తీకి మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ పాసైనవారు JAN 5 నుంచి 12వరకు అప్లై చేసుకోవచ్చు. అటెండెంట్, MNO, FNO, స్ట్రెచర్ బాయ్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, BC, EWS అభ్యర్థులకు రూ.250. వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in/
News January 11, 2026
కామారెడ్డి: దొరకని ఆచూకీ.. ఆగని కన్నీరు!

మంజీరా నదిలో నాణేల కోసం వెళ్లి పిట్లం మండలం బొల్లక్‌పల్లి వాసి <<18817781>>తడబోయిన సాయిలు(42) గల్లంతైన<<>> విషయం విదితమే. రంగంలోకి దిగిన గజ ఈతగాళ్లు శనివారం రోజంతా నదిలో గాలించినా ఫలితం లేకపోయింది. ఆదివారం రెండో రోజు కూడా విపత్తు నిర్వహణ బృందం సభ్యులు నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినా మృతదేహం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు నది ఒడ్డున కన్నీరుమున్నీరుగా వేచి చూస్తున్నారు.
News January 11, 2026
ట్రంప్ టారిఫ్స్.. TNలో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!

ఇండియాపై ట్రంప్ విధించిన టారిఫ్స్ వల్ల తమ రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు రిస్క్‌లో పడ్డాయని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ‘TN గూడ్స్ ఎగుమతుల్లో 31% USకే వెళ్తాయి. సుంకాల వల్ల టెక్స్‌టైల్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. 30 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. MSMEలు మూతబడేలా ఉన్నాయి’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగమ్ తెన్నరసు చెప్పారు. వస్త్ర రంగం కోసం ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.


