News December 17, 2025

మీ బ్రెయిన్ వయస్సుని ఇలా తగ్గించుకోండి

image

వయస్సు పెరగడం సహజమే. కానీ బ్రెయిన్‌ను యవ్వనంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. USకు చెందిన ఫ్లోరిడా వర్సిటీ చేసిన అధ్యయనంలో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించిన వారి మెదడు వాస్తవ వయస్సు కంటే 8 ఏళ్లు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. మంచి నిద్ర, సరైన బరువు, స్మోకింగ్‌కు దూరంగా ఉండటం, ఒత్తిడిని నియంత్రించడం వంటివి బ్రెయిన్ ఆరోగ్యాన్ని పెంచినట్లు తేలింది. తద్వారా ఓల్డేజ్‌లో వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధులు రావు.

Similar News

News March 15, 2026

పుట్టా మహేశ్‌కు టీడీపీ షోకాజ్ నోటీస్

image

AP: పార్టీ చీఫ్ చంద్రబాబు <<19391495>>ఆదేశాలతో<<>> పుట్టా మహేశ్‌కు టీడీపీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయని TDP రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై 48 గంటల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివరణ ఇచ్చేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.

News March 15, 2026

ఫింగర్ ప్రింట్‌లాగే టంగ్ ప్రింట్స్.. తెలుసా?

image

ప్రతి మనిషికి వేలిముద్రలు ఎలాగైతే వేర్వేరుగా ఉంటాయో నాలుక ముద్రలు (Tongue prints) కూడా అలాగే ఒకరితో ఒకరికి అస్సలు పోలి ఉండవు. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల నాలుక ఆకృతి, ఉపరితల నిర్మాణం ఒకేలా ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కవలల విషయంలోనూ ఇవి భిన్నంగానే ఉంటాయి. ఫ్యూచర్‌లో ఇది అత్యంత నమ్మదగిన బయోమెట్రిక్ గుర్తింపుగా మారే అవకాశం ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో

News March 15, 2026

22న రైతు భరోసా నిధులు

image

TG: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 22వ తేదీ రైతు భరోసా మొదటి విడత నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. సిద్దిపేట(D) నర్మెట్టలో CM రేవంత్ రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు 20రోజుల తర్వాత రెండో విడత, APR నెలాఖరులోగా మూడో విడత నిధులు అందజేయనున్నారు. 3 విడ‌త‌ల్లో క‌లిపి రైతుల ఖాతాల్లో సుమారు రూ.9 వేల కోట్లు జమ కానున్నాయి.