News April 21, 2024
సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం HYD నుంచి హెలికాప్టర్లో వస్తే భువనగిరి పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో దిగనున్నారు. రోడ్డు మార్గంలో వస్తే పెద్ద చెరువు నుంచి టాప్స్ బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ HYD చౌరస్తా, జగదేవపూర్ చౌరస్తా మీదుగా వినాయక చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ కార్నర్ మీటింగ్ అనంతరం సాయిబాబా గుడి వరకు ర్యాలీగా ముందుకు సాగుతారు.
Similar News
News September 12, 2025
నల్గొండ: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నల్గొండ మండలం మేళ్ల దుప్పలపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకట్ మృతి చెందాడు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
News September 12, 2025
నల్గొండ: ఉద్యోగాలకు సాధనకు 15న ఆమరణ నిరాహార దీక్ష

రెండు లక్షల ఉద్యోగాల సాధనకు ఈనెల 15న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నిరుద్యోగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాలకూరి అశోక్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్లను హైదరాబాద్‌లో గురువారం ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కలిసి ఆవిష్కరించారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నిరాహార దీక్షకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు ప్రకటించాలని కోరారు.
News September 12, 2025
NLG: ఆర్టీసీలో యాత్రాదానం

యాత్రాదానం పేరుతో వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానిరెడ్డి తెలిపారు. గిఫ్ట్ ఏ బస్ ట్రావెల్ పథకం కింద కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, NRIలు, సామాజిక బాధ్యతతో వృద్ధులు, దివ్యాంగులకు రవాణా సేవలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సంస్థకు విరాళాలు అందిస్తే యాత్రాదాన నిధి కింద ప్రత్యేక ఖాతాలో జమ చేస్తామని తెలిపారు.