News December 17, 2025
Way2News కథనానికి స్పందించిన సీతక్క

Way2News కథనానికి మంత్రి సీతక్క స్పందించారు. మంగపేట మండలం దోమడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఏటూరునాగారంలో ఈనెల 9న ప్రచారానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా మంగళవారం<<18583277>> ‘మంత్రి సీతక్క.. ఆదుకోవా’ <<>>అనే శీర్షిక Way2News ద్వారా ప్రచురించగా సీతక్క స్పందించారు. బాధితుడితో ఫోనులో మాట్లాడి చికిత్సకు తోడ్పడతానని హామీ ఇచ్చారు.
Similar News
News January 11, 2026
వేములవాడ: TGLA క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGLA) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన 2026 క్యాలెండర్‌ను వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఆదివారం నాడు వేములవాడలోని తన క్యాంపు కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరించి లెక్చరర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఎల్ఏ జిల్లా శాఖ అధ్యక్షుడు ఆర్ లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి జే.సుమన్ సభ్యులు పాల్గొన్నారు.
News January 11, 2026
KNR: నేటితో ముగియనున్న ఉచిత శిక్షణ దరఖాస్తు

విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు గాను ఐఈఎల్‌టీఎస్ ఇంగ్లిష్ ఉచిత శిక్షణ దరఖాస్తు ఆదివారంతో ముగుస్తుందని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=bce వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News January 11, 2026
HYD: పతంగుల పండుగ.. పిల్లలు పైలం!

సంక్రాంతి వచ్చిందంటే పిల్లల్లో ఆనందం పొంగిపొర్లుతుంది. పతంగులు ఎగురవేయడంలో పరస్పరం పోటీ పడుతూ సంబరాలు చేసుకుంటారు. తెగిపోయిన వాటికోసం పరుగులు పెడుతుంటారు. రోడ్లు, గుంతలు గమనించకుండా పతంగులను పట్టుకోవాలనే ఆత్రుతలో ప్రమాదాలకు ఎదురెళ్తారు. రేలింగ్ లేని బంగ్లాలపై కైట్‌లు ఎగురవేయడం వల్ల గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి.
✦ పేరెంట్స్ పిల్లలపై నజరేయండి. సంక్రాంతిని సంతోషంగా జరుపుకోండి.


