News December 17, 2025

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

image

జిల్లాలోని 7 మండలాల్లో గల 158 పంచాయతీలు, 1,364 వార్డు స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. అచ్చంపేట, లింగాల, అమ్రాబాద్‌ తదితర మండలాల్లో అధికారులు తొలుత వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం సర్పంచ్ ఫలితాలను వెల్లడించనున్నారు. మేజర్ పంచాయతీల ఫలితాలు వెలువడటానికి రాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉందని, అనంతరం ఉపసర్పంచుల ఎన్నిక ఉంటుందని అధికారులు తెలిపారు.

Similar News

News March 3, 2026

GHMC: ప్రభుత్వ భవనాలే రూ.వెయ్యి కోట్ల బాకీ?

image

GHMC విభజన తర్వాత ఖజానా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సుమారు ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు చర్యలకు దిగారు. బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ అయ్యాయి. గడువులోగా చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేయొచ్చు. విడ్డూరమేంటంటే.. ప్రభుత్వ భవనాలే దాదాపు ₹1,000 కోట్లు బకాయి ఉన్నాయి. సామాన్యుడిపై కొరడా ఝుళిపించే యంత్రాంగం ప్రభుత్వ సంస్థల బకాయిలను ఎలా వసూలు చేస్తుందో చూడాలి.

News March 3, 2026

దేవరకొండ హోలీ సంబరాల్లో విషాదం.. విద్యార్థి మృతి (Update)

image

దేవరకొండ ఉప్పవాగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్తికేయన్ మృతి చెందాడు. స్నేహితులతో కలిసి హోలీ ఆడేందుకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొన్నారు. విద్యార్థి తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా అక్కడ చనిపోయాడు. మరో విద్యార్థి శ్రీనివాసచారి పరిస్థితి విషమంగా ఉంది.

News March 3, 2026

ఇంటర్ పూర్తవుతుందా.. NEXT ఏంటి?

image

ఇంటర్ తర్వాత విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తునిచ్చే అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. MPC వారికి ఇంజినీరింగ్, పైలట్, రక్షణ రంగాలు. BiPC వారికి మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉత్తమ మార్గాలు. MEC, CEC వారు CA, LAW, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో రాణించవచ్చు. డిజైనింగ్, యానిమేషన్ వంటి కోర్సులూ ఎంచుకోవచ్చు. డిగ్రీలోనూ చేరవచ్చు. IIT, NEET, CLAT వంటి ప్రవేశ పరీక్షలు రాసి ఉన్నత సంస్థల్లో చేరవచ్చు. SHARE IT