News December 17, 2025

కరీంనగర్: పోలింగ్ ముగిసింది.. కౌంట్ డౌన్ షురూ

image

పల్లె పోరు తుది దశకు చేరింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 388 GPలకు జరిగిన మూడవ విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ 84.35%, పెద్దపల్లి జిల్లా 82.34%, జగిత్యాల77.83%, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 76.39% ఓట్లు పోలయ్యాయి. రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా అధికారులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

Similar News

News January 2, 2026

కాంటాక్ట్ నేమ్‌తో కాల్స్ వస్తున్నాయా? No Tension

image

ఈ మధ్య సేవ్ చేయని ఫోన్ నంబర్ నుంచి కాల్ వచ్చినా స్క్రీన్‌పై నేమ్ కన్పిస్తోందా? స్కామర్స్, స్పామర్స్‌కు చెక్ పెట్టేలా CNAP ఫీచర్‌ను ట్రాయ్ 2025 OCT నుంచి టెస్ట్ చేస్తోంది. ఈ కాలింగ్ నంబర్ ప్రజెంటేషన్ ఫీచర్‌ను MAR31 లోపు అమలు చేయనుంది. కనెక్షన్ టైంలో ఇచ్చే వివరాలతో టెలికం కంపెనీలు పేర్లు డిస్ప్లే చేస్తాయి. Spamగా Report చేస్తే డేటా అప్డేట్ అవుతుంది. ఇక True Caller లాంటి యాప్స్ అవసరం ఉండదు.Share It

News January 2, 2026

‘కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పూర్తి చేయాలి’

image

కడప జిల్లాలో శతాబ్ద కాలం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న ఉక్కు పరిశ్రమను తక్షణమే పూర్తి చేయాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో జమ్మలమడుగు కన్యతీర్థం వద్ద ఉక్కు శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించారు. కడప జిల్లా తీవ్రంగా వెనుకబడిన ప్రాంతమని, పరిశ్రమల లేమివల్ల యువతకు ఉపాధి ఉంటుందన్నారు.

News January 2, 2026

పెద్దపల్లి: ‘ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’

image

పెద్దపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఉపాధిహామీ పనులపై కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమైన ఆయన.. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఏఈలు ఇళ్ల గ్రౌండింగ్‌ ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహించి పనులు వేగవంతం చేయాలని, ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు.