News December 17, 2025
కామారెడ్డి జిల్లాలో మూడో విడత తొలి ఫలితం

నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంప్ సర్పంచ్ స్థానంపై ఉత్కంఠకు తెరపడింది. అంకోల్ క్యాంప్ సర్పంచ్‌గా అనిత-రాములు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అనితకు 209 మెజారిటీ వచ్చింది. తన సమీప ప్రత్యర్థి సావిత్రికి 36 ఓట్లు వచ్చాయి. 3 ఓట్లు చెల్లలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Similar News
News December 30, 2025
పల్నాడు: ఇకపై 3 గంటల్లోనే రాజధానుల ప్రయాణం.!

హైదరాబాద్-అమరావతి మధ్య ప్రయాణ కాలాన్ని తగ్గించేలా నల్లపాడు-బీబీనగర్ డబ్లింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ మీదుగా 4 దశల్లో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ లైన్ పూర్తయితే ఇరు రాజధానుల మధ్య ప్రయాణ సమయం కేవలం 3 గంటలకు తగ్గనుంది. రైళ్ల వేగం పెరగడంతో పాటు క్రాసింగ్‌ల ఇబ్బందులు తొలగి ప్రయాణికులకు పెద్ద ఊరట లభించనుంది.
News December 30, 2025
MOIL లిమిటెడ్ 67 పోస్టులకు నోటిఫికేషన్

<
News December 30, 2025
కృష్ణా: అజ్ఞాతంలో వల్లభనేని వంశీ

గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. 2024 జూన్ 7న సునీల్‌పై జరిగిన దాడి కేసులో వంశీ ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 17న మాచవరం పోలీసులు వంశీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి వంశీ కనిపించకపోవడంతో, అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మొన్నటి వరకు నియోజకవర్గంలో ఆక్టివ్‌గా ఉన్న వంశీ సడన్‌గా అదృశ్యమయ్యారు.


