News December 17, 2025

గద్వాల్ జిల్లాలో తొలి సర్పంచ్ ఫలితం ఇక్కడే..!

image

అలంపూర్ మండల కేంద్రంలోని బైరంపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు స్వాతి 92 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజయం అనంతరం స్వాతి మాట్లాడుతూ.. బైరంపల్లి గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడంతో బైరంపల్లి గ్రామంలో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

Similar News

News January 13, 2026

20న నెల్లూరు జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం

image

నెల్లూరు జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు సీఈవో శ్రీధర్ రెడ్డి తెలిపారు. గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, నీటి సరఫరా, పరిశ్రమలు, మత్స్య, ఉద్యాన, మైక్రోఇరిగేషన్, విద్యా, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, ఐటీడీఏ, జిల్లా వెనుకబడిన శాఖలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సభ్యులు, అధికారులు హాజరు కావాలని కోరారు.

News January 13, 2026

ఇరాన్‌లో రక్తపాతం.. 2,000 మంది మృతి!

image

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఇప్పటివరకు సుమారు 2,000 మంది మరణించినట్లు సమాచారం. ఈ మరణాలకు ‘ఉగ్రవాదులే’ కారణమని ఇరాన్ అధికారులు ఆరోపిస్తుండగా, భద్రతా దళాల కాల్పుల వల్లే పౌరులు ప్రాణాలు కోల్పోయారని మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఇంటర్నెట్ నిలిపివేతతో పూర్తి వివరాలు తెలియడం లేదు. అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది.

News January 13, 2026

విద్యుత్ చార్జీలపై అభిప్రాయ సేకరణ.. ఎప్పుడంటే?

image

2026-27 ఆర్థిక సంవత్సర విద్యుత్ టారిఫ్‌పై ఈ నెల 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు ఎస్‌ఈ రాజేశ్వరి మంగళవారం తెలిపారు. ఏపీఈఆర్‌సీ ఛైర్మన్ పి.వి.ఆర్.రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. డిస్కంలు సమర్పించిన చార్జీల ప్రతిపాదనలపై ప్రజలు తమ అభిప్రాయాలను అమలాపురం ఎస్‌ఈ కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.