News April 21, 2024

రేపు జగ్గంపేటలో పర్యటించనున్న చంద్రబాబు

image

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జగ్గంపేటలో పర్యటించనున్నట్లు ఆపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. చంద్రబాబు రోడ్ షోలో భాగంగా శనివారం హెలీప్యాడ్ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. గోకవరం రోడ్డులో కోడూరి రంగారావుకు చెందిన స్థలం వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Similar News

News October 10, 2025

తూ.గో జిల్లాలో ‘నూరు శాతం ఈ క్రాప్ పూర్తి’

image

తూ.గో జిల్లాలో వరి పంటకు నూరు శాతం ఈ క్రాప్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమయ్యాయన్నారు. రాజమండ్రి రూరల్ 16 , కొవ్వూరు 96, నల్లజర్ల 50, నిడదవోలు 20, గోపాలపురం 10, దేవరపల్లి 35, చాగల్లులో 25 ఎకరాల్లో వరి కోతలు పూర్తి చేశారన్నారు.

News October 10, 2025

గోదావరి పుష్కరాల యాక్షన్ ప్లాన్ సమావేశం

image

రాజమహేంద్రవరం క్యాంప్ కార్యాలయంలో గోదావరి పుష్కరాల యాక్షన్ ప్లాన్ మీటింగ్ గురువారం జరిగింది. కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మితతో మంత్రి కందుల దుర్గేశ్ సమావేశం నిర్వహించారు. ఈ పుష్కరాలు రాష్ట్ర గౌరవానికి ప్రతీకగా, కోట్లాది భక్తుల ఆధ్యాత్మిక ఉత్సవంగా జరుగుతాయన్నారు. అందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

News October 9, 2025

రాజమండ్రిలో పవన్ కళ్యాణ్‌కు కలెక్టర్ స్వాగతం

image

కాకినాడ జిల్లా పర్యటన నిమిత్తం గురువారం రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆయనకు మొక్క అందించి ఆహ్వానించారు. కొద్దిసేపటి తరువాత జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ అక్కడి నుండి కాకినాడకు పయనమయ్యారు.