News December 17, 2025
అప్పయ్యపల్లి సర్పంచ్‌గా సుప్రియ

HNK జిల్లా శాయంపేట మండలం అప్పయ్యపల్లి సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సుప్రియ వినయ్ కుమార్ ఘన విజయం సాధించారు. అప్పయ్యపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సర్పంచ్‌గా సుప్రియ ఎన్నికవడంతో వారి మద్దతుదారులు సంబరాలు జరుపుకొన్నారు.
Similar News
News January 3, 2026
GHMC కీలక నిర్ణయం.. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో మార్పు

GHMC కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సహాయ వైద్యాధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో మార్పులు తీసుకొచ్చారు. ఇకపై ఈ సర్టిఫికెట్లు సహాయ మున్సిపల్ కమిషనర్ల ద్వారా జారీ చేయనున్నట్లు GHMC కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ నిర్ణయంతో పరిపాలనా సమన్వయం మెరుగుపడడంతో పాటు ప్రజలకు సేవలు మరింత వేగంగా అందనున్నాయని పేర్కొంది.
News January 3, 2026
ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు

<
News January 3, 2026
ASF జిల్లా సర్పంచులకు శిక్షణ

ఆసిఫాబాద్ జిల్లాలోని సర్పంచులకు 2026 సంవత్సరానికి సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించన్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 6 నుంచి 12వ తేదీ వరకు యోగా, కళా మేళా, మానసిక శిక్షణ, పర్యటన, లక్ష్యసాధన, సేవా భావం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సర్పంచులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.


