News December 17, 2025
21న పల్స్ పోలియో కార్యక్రమం: డీఆర్‌ఓ

21న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఆర్‌ఓ జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో దీనిపై ఆయన సమీక్ష నిర్వహించారు. సంబంధిత పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా ఐదేళ్లలోపు ఉన్న 1.94 లక్షల మంది చిన్నారుల కోసం 1332 పోలియో బూత్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి బిడ్డకు చుక్కలు వేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Similar News
News December 25, 2025
సంతూర్.. సంతూర్.. దేశంలో అతిపెద్ద సోప్ బ్రాండ్ ఇదే!

దేశంలో అతిపెద్ద సోప్ బ్రాండ్‌గా ‘Santoor’ నిలిచింది. ఏడాది కాలంలో ₹2,850 కోట్ల సబ్బుల సేల్స్ జరిగినట్లు ఇన్వాయిస్డ్ సేల్స్ డేటా వెల్లడించింది. ‘1986లో ₹60 కోట్ల ఆదాయం సాధించాం. లైఫ్‌బాయ్‌ను అధిగమించి దేశంలో No.1గా సంతూర్ నిలిచింది. ప్రజల అవసరాలపై అవగాహన, క్రమశిక్షణ, ఆకర్షణీయ యాడ్స్ ఈ విజయానికి కారణం’ అని విప్రో కన్జూమర్ ప్రొడక్ట్స్ CEO వినీత్ అగర్వాల్ చెప్పారు. మీరూ సంతూర్ మమ్మీ, డాడీనా? కామెంట్.
News December 25, 2025
కృష్ణా: రోడ్డు ప్రమాదం.. మహిళ దుర్మరణం

ఏ కొండూరు మండలం గోపాలపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందారు. గ్రామానికి చెందిన భూక్య కమల (40) రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే కన్నుమూశారు. కమల మృతితో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
News December 25, 2025
తూ.గో: విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు

మండపేటలోని ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ట్యూషన్ సమయంలో అసభ్యకర మెసేజులతో వేధిస్తుండటంతో భయపడిన బాలిక పాఠశాలకు వెళ్లడం మానేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఈ నెల 22న విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సదరు ఉపాధ్యాయుడిని యాజమాన్యం విధుల నుంచి తొలగించింది.


