News December 17, 2025
చెన్నూరు: మ:1గంట వరకు 87.84%ఓటింగ్

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చెన్నూరు మండలంలో 3వ విడత పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 87.84% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మండలంలో మొత్తం 26,102 మంది ఓటర్లు ఉండగా, 22,967 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు మండల ఎన్నికల అధికారి వివరించారు.
Similar News
News January 13, 2026
ఎంత ప్రయత్నించినా పెళ్లి కావడం లేదా? రేపే లాస్ట్..

ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి సంబంధం కుదరని వారు రేపు గోదా రంగనాథుల కళ్యాణాన్ని వీక్షించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ వేడుకను దర్శిస్తే తప్పక వివాహ యోగం కలుగుతుందని అంటున్నారు. ‘స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం వల్ల జాతకంలోని వివాహ ప్రతిబంధకాలు తొలగిపోతాయి. త్వరగా పెళ్లి జరిగే అవకాశాలు పెరుగుతాయి. గోదాదేవి చేసిన తిరుప్పావై వ్రత ఫలితంగానే ఆమెకు విష్ణుమూర్తి భర్తగా లభించారు’ అని చెబుతున్నారు.
News January 13, 2026
జపాన్‌కు ఎంపికైన మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీ విద్యార్థి

రాజోలి మండలం మాన్దొడ్డి గ్రామానికి చెందిన పరశురాం ‘సకుర సైన్స్ టాలెంట్’ పరీక్షలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించి జపాన్ పర్యటనకు ఎంపికయ్యాడు. మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీలో పీయూసీ చదువుతున్న ఇతడు, వారం రోజుల పాటు జపాన్‌లోని అధునాతన సాంకేతికతను పరిశీలించి, శాస్త్రవేత్తలతో భేటీ కానున్నాడు. ఈ సందర్భంగా కాలేజీ అధ్యాపక బృందం పరశురాంను ఘనంగా సన్మానించారు.
News January 13, 2026
పొలిటికల్ హీట్.. నిజామాబాద్‌లో కాంగ్రెస్ Vs బీజేపీ

మున్సిపల్ ఎన్నికల వేళ నిజామాబాద్ పాలిటిక్స్ హీటెక్కాయి. ఎన్నికలు రాగానే హిందూత్వ అని బీజేపీ హడావుడి చేస్తుందని రాముడు బీజేపీలో సభ్యత్వం తీసుకున్నాడా అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రాముని జోలికి వస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా కౌంటర్ ఇచ్చారు. రాముని అంశం నేపథ్యంలో నిజామాబాద్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారి మాటల యుద్ధం పెరిగింది.


