News December 17, 2025
మెస్సీకి అంబానీ గిఫ్ట్.. ఖరీదు ఎంతో తెలుసా?

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ నిన్న గుజరాత్‌లోని <<18586214>>వనతార<<>>ను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెస్సీకి అనంత్ అంబానీ అరుదైన బహుమతి ఇచ్చారు. రిచర్డ్ మిల్లీ RM 003 V2 వాచ్‌ను బహూకరించారు. దీని విలువ దాదాపు రూ.10.91 కోట్లు కావడం గమనార్హం. ఈ లిమిటెడ్ ఆసియా ఎడిషన్ వాచ్‌లు ప్రపంచంలో 12 మాత్రమే ఉన్నాయి. ‘గోట్ టూర్’లో భాగంగా ఈ నెల 13-16 తేదీల్లో ఇండియాలో మెస్సీ పర్యటించారు.
Similar News
News February 20, 2026
నానబెట్టిన మెంతులు మంచివేనా?

మెంతుల్లో ఎ, బి,సి, కె విటమిన్లతో పాటు ఫైబర్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ముఖ్యంగా మెంతులను నానబెట్టుకుని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి షుగర్, బరువును తగ్గించడంతో పాటు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు, బీపీ మందులు వాడేవారు, గర్భిణులు వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాతే సరైన మోతాదులో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
News February 20, 2026
తీగ చిక్కుడులో ఆముదం మొక్కలు ఎందుకంటే?

తీగ చిక్కుడు పంటను సాగు చేసే కొందరు రైతులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఆముదం మొక్కలను తీగ చిక్కుడు పంటలోని ప్రతి ఆరు అడుగులకు ఒకటి చొప్పున నాటుతున్నారు. దీని వల్ల చీడపీడల సమస్య తగ్గడంతో పాటు ఆముదం మొక్కలు పెరిగాక వాటి ఆకులు తీగ చిక్కుడుకు షేడ్‌నెట్‌లా పనిచేస్తున్నాయి. ఫలితంగా చిక్కుడు పంటపై ఎండ తీవ్రత తగ్గి మంచి దిగుబడి వస్తోందని, ఈ పద్ధతిని అనుసరిస్తున్న రైతులు చెబుతున్నారు.
News February 20, 2026
భారీ జీతంతో RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలు

RITES లిమిటెడ్ 3 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సివిల్ ఇంజినీరింగ్, MA/MSc/ఎన్విరాన్‌మెంట్ డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 9వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ లీడర్‌కు నెలకు రూ.3లక్షలు, సేఫ్టీ, హెల్త్& ఎన్విరాన్‌మెంట్ ఎక్స్‌పర్ట్‌కు నెలకు రూ.85వేలు చెల్లిస్తారు. మార్చి 10న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rites.com


