News April 21, 2024

ఆదిలాబాద్: రెండు వ్యానులు ఢీ

image

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలు కాగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున మహారాష్ట్ర నాందేడ్ నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న వ్యాన్‌ను సుంకిడి అంతరాష్ట్ర రహదారిపై మరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు కాగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్స్ ఈఎంటీ దీపక్, పైలెట్ వసీం రిమ్స్‌కు తరలించారు

Similar News

News March 6, 2026

9న ఆదిలాబాద్ ITI కళాశాలలో అప్రెంటిషిప్ మేళా

image

ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 9న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కావున జిల్లాలోని ITI ఉత్తీర్ణులైన విద్యార్థులు https://www.apprenticeshipindia.gov.in/mela Registration ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. శిక్షణ కాలంలో స్టైఫండ్ అందజేస్తామని తెలిపారు.

News March 6, 2026

ఉట్నూర్: ATCలో షార్ట్ టైం కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రభుత్వ ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో క్రాఫ్ట్ మ్యాన్ ట్రైనింగ్ స్కీమ్‌లో భాగంగా నిర్వహించే అఖిల భారత వాణిజ్య పరీక్ష షార్ట్ టైం కోర్సులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఉట్నూర్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. వివిధ కేటగిరీల వారీగా కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఏదైనా సందేహాలు ఉంటే కళాశాలకు నేరుగా వచ్చి సంప్రదించాలన్నారు.

News March 6, 2026

అతివలకు అండగా ఆదిలాబాద్ షీ టీం

image

ఆదిలాబాద్ జిల్లాలో మహిళల భద్రతకు షీ టీమ్స్ నిరంతరం సేవలందిస్తున్నాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గత నెలలో 54 ఫిర్యాదులు స్వీకరించి, 61 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. 118 హాట్‌స్పాట్‌లలో తనిఖీలు చేపట్టి 53 మంది పోకిరీలపై చర్యలు తీసుకున్నారు. “పోలీసు అక్క” ద్వారా విద్యాసంస్థల్లో అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 లేదా 8712659953 నంబర్లకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.