News December 17, 2025
కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది: హరీశ్ రావు

TG: రాజ్యాంగాన్ని రక్షించాలనే రాహుల్ గాంధీ నినాదం ఉద్దేశం ఇవాళ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన <<18592868>>తీర్పుతో<<>> బహిర్గతమైందని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని, అధికార పార్టీకి అనుకూల నిర్ణయాలతో రాజ్యాంగాన్ని కాలరాసిందని ఫైరయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీల నిజస్వరూపమని మండిపడ్డారు.
Similar News
News January 2, 2026
టీవీ రేటింగ్స్.. రికార్డు సృష్టించిన బిగ్‌బాస్-9

టీవీ రేటింగ్‌లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే రికార్డు సృష్టించినట్లు హోస్ట్ నాగార్జున తెలిపారు. ‘స్టార్ మాలో 19.6 TVR, జియో హాట్‌స్టార్‌లో 285M స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చాయి. గత 5 సీజన్స్‌లో ఇదే అత్యధికం. ఈ సీజన్ మొత్తం ఎమోషన్స్, ప్యాషన్, కాన్‌ఫ్లిక్ట్స్, మర్చిపోలేని మూమెంట్స్‌తో నిండిపోయింది. ప్రేక్షకుల అసాధారణ మద్దతు నిజంగా హిస్టారిక్’ అని ట్వీట్ చేశారు.
News January 2, 2026
ఉపాధి హామీకి కేంద్రం తూట్లు పొడుస్తోంది: భట్టి

TG: ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు ఉంటే తప్పా? అని Dy.CM భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘ఉపాధి హామీకి BJP తూట్లు పొడుస్తోంది. ఏ వ్యక్తి ఎక్కడైనా పనిచేసే వీలుంటే.. దానిని నిర్దేశిత ఏరియాకి పరిమితం చేసింది. అన్‌స్కిల్డ్ లేబర్‌ను దోచుకోకూడదని మేము చట్టం చేస్తే.. నో వర్క్ ఇన్ పీక్ సీజన్ అనడం దోపిడీ కాదా? రైట్ టు వర్క్.. పర్మిట్ టు వర్క్‌గా మార్చేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News January 2, 2026
AP, TG మధ్య ఉన్న జలవివాదాలు ఏంటి?

AP, TG జల <<18742119>>వివాదాలు<<>> దశాబ్దాలుగా ఉన్నాయి. TG విద్యుదుత్పత్తితో శ్రీశైలంలో తమ నీటి వాటా తగ్గుతోందని AP వాదిస్తోంది. నాగార్జునసాగర్ నుంచి AP ఎక్కువ నీటిని తీసుకుంటోందనేది TG అభ్యంతరం. KWDT-I అవార్డు ప్రకారం AP, TG వాటా 66:34 నిష్పత్తి కాగా తెలంగాణ 50% ఇవ్వాలంటోంది. పాలమూరును AP వ్యతిరేకిస్తోంది. పోలవరం-బనకచర్లకు TG ససేమిరా అంటుండగా గోదావరి మిగులు నీటిపై హక్కు తమదేనని AP వాదిస్తోంది. ఇలా అనేకమున్నాయి.


