News December 17, 2025
గుండాలలో 1,344 ఓట్ల తేడాతో విజయం

గుండాల గ్రామపంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు దేవనబోయిన ఐలయ్య 1,344 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. తన గెలుపునకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కోన్నారు. దీంతో గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
Similar News
News January 8, 2026
హార్దిక్ విధ్వంసం.. 31 బంతుల్లోనే

విజయ్ హజారే ట్రోఫీలో హార్దిక్ పాండ్య(బరోడా) సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నారు. ఇవాళ చండీగఢ్‌పై 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ఆయన మొత్తంగా 31 బాల్స్‌లో 75 రన్స్(9 సిక్సర్లు, 2 ఫోర్లు) బాదారు. ప్రియాంశ్(113), విష్ణు(54), జితేశ్(73) రాణించడంతో బరోడా 391 రన్స్ చేసింది. కాగా విదర్భపై తొలి మ్యాచ్‌లోనూ హార్దిక్ 92 బంతుల్లో 133 రన్స్(11 సిక్సర్లు, 8 ఫోర్లు) చేసిన విషయం తెలిసిందే.
News January 8, 2026
ఉల్లికాడలతో ఎన్నో లాభాలు

ఉల్లికాడలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మహిళల ఎముకలు దృఢంగా ఉండాలంటే సి విటమిన్ ఉన్న ఈ ఉల్లికాడలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దగ్గూ, జలుబూ రాకుండా చూస్తాయి. రక్తంలోని షుగర్, గ్లూకోజ్ శాతాన్ని అదుపులో ఉంచడంతో పాటు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి. అలాగే ఇవి కంటి చూపునూ మెరుగుపరుస్తాయి.
News January 8, 2026
దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేయ్.. KTRకు పొంగులేటి సవాల్

TG: కేటీఆర్ ఖమ్మంలో పోటీ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయనకు దమ్ముంటే తన ఛాలెంజ్ స్వీకరించాలన్నారు. నిన్న ఖమ్మం వచ్చిన KTR ఏదేదో మాట్లాడారని, ముందు తన ఇంట్లో వ్యవహారం చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ జోలికి వస్తే సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ముందు కేటీఆర్ తన అవినీతి కేసుల గురించి చూసుకోవాలని, ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.


