News December 17, 2025

ములుగు జిల్లాలో బోణీ కొట్టిన సీపీఎం

image

ములుగు జిల్లాలో మొదటిసారి సీపీఎం బోణీ కొట్టింది. వెంకటాపురం మండలం భోదాపురం గ్రామ పంచాయతీలో సీపీఎం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కోర్స నరసింహారావు గెలుపొందారు. నరసింహారావుకు 145 ఓట్ల మెజార్టీ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో సీపీఎం నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Similar News

News January 13, 2026

రైతన్నకు తప్పని ‘యూరియా’ కష్టాలు

image

జిల్లాలో యాసంగి వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్న వేళ, ఎరువుల కొరత రైతులను వేధిస్తోంది. ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ ద్వారానే యూరియా తీసుకోవాలన్న నిబంధన రైతులకు ఇబ్బందిగా మారింది. కేవలం PACS, మన గ్రోమోర్ కేంద్రాల్లోనే స్టాక్ ఉండటం, ప్రైవేటు డీలర్లు అమ్మకాలు నిలిపివేయడంతో యూరియా దొరకడం గగనమైంది. పొలాలకు ఎరువులు వేయాల్సిన సమయంలో గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News January 13, 2026

సిద్దిపేట: మున్సిపోల్.. మహిళా ఓటర్లే అధికం

image

మున్సిపల్ వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను అధికారులు వెల్లడించారు. సిద్దిపేట మినహా ఇతర మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సిద్ధమయ్యారు.
గజ్వేల్‌లో మొత్తం 46740 మంది ఓటర్లకు మహిళలు 24001, పురుషులు 22738, ఇతరులు ఒక్కరు,
దుబ్బాకలో 21341 మందికి పురుషులు 10224, మహిళలు 11117,
చేర్యాలలో 13777 మందికి పురుషులు 6658, మహిళలు 7119,
హుస్నాబాద్‌లో 19227 మందికి పురుషులు 9348, మహిళలు 9873, ఇతరులు 6 మంది ఉన్నారు.

News January 13, 2026

నిర్మల్ జిల్లాలో లేగదూడపై చిరుత దాడి

image

నిర్మల్ జిల్లా తానురు మండలం బెంబేరా శివారులో పాడేకర్ దేవన్నకు చెందిన లేగదూడపై చిరుత పులి దాడి చేసి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి పశువుల పాకలో దూడను కట్టి ఇంటికెళ్లానని, ఈరోజు ఉదయం వచ్చి చూడగా మరణించిందని రైతు తెలిపాడు. రాత్రి పూట చిరుతపులి వచ్చి దాడి చేసి చంపేసిందని వెల్లడించాడు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.